Telangana liquor sales record| న్యూ ఇయర్ దెబ్బకు మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డు
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెరిగిన మద్యం అమ్మకాలతో పాటు క్రిస్మస్..గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ నెల మద్యం అమ్మకాలు గత రికార్డులను బద్దలు కొట్టాయి. ఏకంగా 5,050కోట్లకు పైగా మద్యం అమ్మకాలు సాగాయి.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఎక్సైజ్ శాఖకు డిసెంబర్ నెల ఆదాయం కొత్త రికార్డుల(Telangana liquor sales record)ను నమోదు చేసింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెరిగిన మద్యం అమ్మకాల(New Year liquor sales)తో పాటు క్రిస్మస్..గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ నెల మద్యం అమ్మకాలు గత రికార్డులను బద్దలు కొట్టాయి. ఏకంగా 5,050కోట్లకు పైగా మద్యం అమ్మకాలు సాగాయి. 2024డిసెంబర్ నెలతో పోల్చితే 1349కోట్లు ఎక్కువగా మద్యం అమ్మకాలు జరుగడం విశేషం. రికార్డు స్థాయిలో జరిగిన మద్యం అమ్మకాలు కొత్త మద్యం దుకణాల యాజమానులకు ప్రయోజనకరంగా మారాయి.
నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. చివరి మూడు రోజుల్లోనే దాదాపు రూ.1000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గత ఐదు రోజుల్లో రాష్ట్రంలో రూ.1,350 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల్లో 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 30న రికార్డు స్థాయిలో రూ.520కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 31న 370కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లుగా ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పూర్తి వివరాలు అందాల్సి ఉందని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram