Nagarjuna Sagar | నిండు కుండలా నాగార్జున సాగర్.. 20 గేట్లు ఎత్తిన అధికారులు

Nagarjuna Sagar | నాగార్జున సాగర్‌ నిండుకుండలా మారింది. దాంతో అధికారులు 20 గేట్లు ఎత్తారు. ఈ దృశ్యాలను చూసేందుకు సాగర్‌ డ్యామ్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది. ఇటీవల శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీ వరద రావడంతో పది గేట్లను ఎత్తారు. దిగువన ఉన్న నాగార్జుసాగర్‌కు నీటిని వదిలారు.

Nagarjuna Sagar | నిండు కుండలా నాగార్జున సాగర్.. 20 గేట్లు ఎత్తిన అధికారులు

Nagarjuna Sagar : నాగార్జున సాగర్‌ నిండుకుండలా మారింది. దాంతో అధికారులు 20 గేట్లు ఎత్తారు. ఈ దృశ్యాలను చూసేందుకు సాగర్‌ డ్యామ్‌కు సందర్శకుల తాకిడి పెరిగింది. ఇటీవల శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీ వరద రావడంతో పది గేట్లను ఎత్తారు. దిగువన ఉన్న నాగార్జుసాగర్‌కు నీటిని వదిలారు.

దాంతో కేవలం వారం రోజుల్లోనే నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆరు గేట్లను ఎత్తిన అధికారులు 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రాత్రికల్లా డ్యామ్ పూర్తి స్థాయిలో నిండటంతో 10 గేట్లను ఎత్తారు. అయితే మంగళవారం తెల్లవారుజాము వరకు శ్రీశైలం నుంచి వరద ఉధృతి అధికం కావడంతో మొత్తం 20 గేట్లను ఎత్తారు.

ఇందులో 4 గేట్లు 5 ఫీట్ల చొప్పున, 16 గేట్లను 10 ఫీట్ల చొప్పున పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌కు ఇన్‌ఫ్లో 3,00,530 క్యూసెక్కులు వస్తోంది. క్రస్ట్‌ గేట్ల ద్వారా 2,54,460 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 585.80 అడుగుల నీరు నిల్వ ఉంది. మరోవైపు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలకుగాను ప్రస్తుతం 296.85 టీఎంసీలకు నీరు చేరుకుంది.