Nagarjuna Sagar| నిండు కుండలా నాగార్జున సాగర్
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదలు దంచి కొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని జలాశయాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. నాగార్జున సాగర్ డ్యాంకు కూడా ఎగువ శ్రీశైలం నుంచి వరద భారీగా వస్తుండటంతో సాగర్ నిండు కుండలా మారింది.
విధాత: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదలు దంచి కొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని జలాశయాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. నాగార్జున సాగర్ డ్యాంకు కూడా ఎగువ శ్రీశైలం నుంచి వరద భారీగా వస్తుండటంతో సాగర్ నిండు కుండలా మారింది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగ ప్రస్తుత నీటి మట్టం 582.2 అడుగులకు చేరుకుంది. 1,01,800 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా ఔట్‌ఫ్లో 10,294 క్యూ సెక్కుల నీటిని ఎడమ కాలువ ద్వారా 6,844 క్యూ సెక్కుల నీటిని కుడి కాలువ ద్వారా అధికారులు వదులుతున్నారు. అయితే ఖమ్మంలోని పాలేరు జలాశయాన్ని నింపడం కోసం ఎడమ కాలువ ద్వారా విడుదల చేసే నీటిని 1000 క్యూ సెక్కుల నుంచి 3000 క్యూసెక్కులు పెంచుతూ విడుదల చేస్తున్నారు. ఎగువ శ్రీశైలం నుంచి వరద భారీగా వస్తుండటంతో నేడో రేపో అధికారులు సాగర్ డ్యాం క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram