తెరుచుకున్న నాగార్జున సాగర్ 14 క్రస్ట్‌గేట్లు.. దిగువకు కృష్ణమ్మ పరవళ్లు

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను అధికారులు సోమవారం 11గంటలకు తెరిచి దిగువకు నీటి విడుదల ప్రారంభించారు. ముందుగా 2గేట్లను, తర్వాతా ఆరుగేట్లను, తదుపరి 12గేట్లను ఐదు ఫీట్ల మేరకు ఎత్తి దిగువకు నీటి విడుదల చేపట్టారు.

తెరుచుకున్న నాగార్జున సాగర్ 14 క్రస్ట్‌గేట్లు.. దిగువకు కృష్ణమ్మ పరవళ్లు

14గేట్ల నుంచి 1లక్ష 50వేల క్యూసెక్కుల నీటి విడుదల

విధాత, హైదరాబాద్ : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను అధికారులు సోమవారం 11గంటలకు తెరిచి దిగువకు నీటి విడుదల ప్రారంభించారు. ముందుగా 2గేట్లను, తర్వాత ఆరు గేట్లను, సాయంత్రం కల్లా 14గేట్లను ఐదు ఫీట్ల మేరకు ఎత్తి దిగువకు నీటి విడుదల చేపట్టారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర్ రావు, సీఈ అనిల్‌కుమార్‌లు క్రస్ట్‌గేట్ల స్విచ్ ఆన్ చేసి గేట్లు తెరిచారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి జలహారతినిచ్చి పూజలు నిర్వహించారు. ప్రస్తుసతం 312టీఎంసీల పూర్తి స్థాయి నీటి మట్టంకుగాను 292టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 590అడుగులకుగాను 583.40అడుగుల నీటి నిల్వ కొనసాగుతుంది. ఇన్ ఫ్లో 3.54లక్షలుగా ఉండగా, క్రస్ట్‌గేట్ల ద్వారా సోమవారం 1లక్ష 50వేలక్యూసెక్కుల నీటిని దిగువకు వదలుతున్నారు. సాగర్ జలాశయం క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్న నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలను, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. దిగువన ఉన్న పులిచింతల, విజయవాడ బ్యారేజీకి కృష్ణానది పరవళ్లు కొనసాగుతున్నాయి.