నీళ్లు లేవు.. ఉస్మానియా హాస్టల్ బంద్‌

ఉస్మానియా వ‌ర్సిటీకి వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు వ‌ర్సిటీ అధికారులు ప్ర‌క‌టించారు. మే,1 నుంచి 31 వ‌ర‌కు సెల‌వులు ఉన్న‌ట్లు పేర్కొన్నారు. నీరు, విద్యుత్ కొర‌త ఉంద‌ని మెస్‌లు

నీళ్లు లేవు.. ఉస్మానియా హాస్టల్ బంద్‌

మే, 31 వ‌ర‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన ఛీఫ్ వార్డెన్‌

విధాత‌: ఉస్మానియా వ‌ర్సిటీకి వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు వ‌ర్సిటీ అధికారులు ప్ర‌క‌టించారు. మే,1 నుంచి 31 వ‌ర‌కు సెల‌వులు ఉన్న‌ట్లు పేర్కొన్నారు. నీరు, విద్యుత్ కొర‌త ఉంద‌ని మెస్‌లు, హాస్ట‌ల్ మూసి వేస్తున్న‌ట్లు, విద్యార్థులంతా స‌హ‌క‌రించాల‌ని ఛీఫ్ వార్డెన్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. హాస్ట‌ల్‌కు సెల‌వులు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల విద్యార్థులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆదివారం లేడీస్ హాస్టల్‌లో నీళ్లు, విద్యుత్ సరఫరా చేయాలని విద్యార్థులు ధర్నా చేశారు.