అసెంబ్లీలో పురపాలక, పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లు ప్రవేశ పెట్టిన శ్రీధర్ బాబు
పురపాలక,పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం బిల్లును ప్రవేశపెట్టారు
విధాత: పురపాలక,పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం బిల్లును ప్రవేశపెట్టారు. తెలంగాణ పురపాలక చట్టం 2019 నిబంధనలపై చర్చిస్తున్నామని ఆయన అన్నా రు. ప్రభుత్వం సామాజిక, ఆర్ధిక, రాజకీయ, కుల సీపెక్స్ సర్వే చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల సిఫారసుకు చర్యలు చేపట్టామన్నారు. సీపెక్స్ సర్వేతో పాటు ఇతర డేటాను అధ్యయనం చేసి లోతుగా విశ్లేషించి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.రాష్ట్రంలో మొత్తం సామాజిక, ఆర్ధిక పరిస్థితులతో పోలిస్తే వెనుకబాటుతనం ఇంకా కొనసాగుతుందని నివేదిక తెలి పిందని మంత్రి చెప్పారు. విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు సిఫారసు చేసిందని ఆయన తెలిపారు.
వెనుకబడిన తరగతుల జనాభాను దృష్టిలో పెట్టుకుని జనాభా నిష్పత్తికి అనుగుణంగా సరైన ప్రాతినిథ్యం లేకపోవడం గుర్తించామన్నారు. వెనుకబడిన తరగతులకు అనుకూలంగా తెలంగాణ పురపాలక చట్టం 2019 ను సవరించేందుకు నిర్ణయించామని ఆయన అన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు రిజర్వేషన్ బిల్లు తెచ్చామన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు సభ్యులంతా సహకరించాలని ఆయన కోరారు. అసెంబ్లీలో చర్చ జరుగుతున్నందున ఆర్డినెన్స్ కుదరదని మంత్రి చెప్పారు. అందుకే పురపాలక చట్టం-2019 నిబంధన సవరణ చట్టం తెచ్చామన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఆయన అన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram