Warangal: సర్వాయి పాపన్న గొప్ప పోరాట యోధుడు: మంత్రి ఎర్రబెల్లి
తాటిచెట్టుకు మంత్రి పేరు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సర్దార్ సర్వాయి పాపన్న(Sardar Sarvai Papanna) గొప్ప పోరాట యోధుడ(Greatest Fighter)ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) అన్నారు. జనగామ(Janagama) జిల్లా కొడకండ్లలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆదివారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న కుటుంబంలో పుట్టి, గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి పాపన్న అని కొనియాడారు. పాపన్న కేవలం వ్యక్తి మాత్రమే కాదు శక్తి […]

- తాటిచెట్టుకు మంత్రి పేరు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సర్దార్ సర్వాయి పాపన్న(Sardar Sarvai Papanna) గొప్ప పోరాట యోధుడ(Greatest Fighter)ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) అన్నారు. జనగామ(Janagama) జిల్లా కొడకండ్లలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆదివారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న కుటుంబంలో పుట్టి, గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి పాపన్న అని కొనియాడారు. పాపన్న కేవలం వ్యక్తి మాత్రమే కాదు శక్తి అని, నిజాం పాలన పై తిరుగుబాటు యోధుడు అని వివరించారు. బానిస పాలన పై యుద్ధం ప్రకటించిన గొప్పవ్యక్తి అని అన్నారు.
కల్లుతాగిన మంత్రి ఎర్రబెల్లి
మంత్రి మీద అభిమానంతో గౌడ సోదరులు పోటీ పడి కల్లు పోశారు. ఈ సందర్భంగా ఒక తాటి చెట్టుకు మంత్రి ఎర్రబెల్లి పేరు పెట్టుకున్నారు. ఆ చెట్టు కల్లు తాగాల్సిందేనని పట్టు పట్టి, మంత్రిని ఒక పట్టు పట్టాలని అభ్యర్థించారు. కాదనలేని స్థితిలో మంత్రి ఆ కల్లు తాగి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కల్లు రుచి బాగుందని మంత్రి అభినందించారు.
అనంతరం కొడకండ్ల నుండి జలాల్ పూర్ క్రాస్ వరకు కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్డును మంత్రి ప్రారంభించారు. మంత్రి పెళ్ళి రోజు కావడంతో కేకులు కట్ చేసి ఉత్సాహంగా వేడుక జరిపారు. కార్యక్రమంలో నాగపురి రాజలింగం, సర్వాయి పాపన్న సినిమా హీరో జైహింద్ గౌడ్, స్థానిక గౌడ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.