నేను చేసిన సేవలను జనం మరిచిపోయారు ,పీసీసీ చీఫ్, సీఎం అవుతా … టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
తాను ఇంతకాలం చేసిన సేవలను ప్రజలు మర్చిపోయారేమోనని అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విధాత, హైదరాబాద్ : తాను ఇంతకాలం చేసిన సేవలను ప్రజలు మర్చిపోయారేమోనని అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను ఓట్ల కోసం ప్రజా సేవ చేయనన్నారు. ఎమ్మెల్యే పదవి కోసం నేను అడుక్కోవాలా? అలా అడుక్కునే పదవి నాకు వద్దు అని అన్నారు. నేను పదవి లేకున్నా బతుకుతానని, అధికారంలో ఉన్నా.. లేకున్నా నాకు ప్రజలే ముఖ్యమని పేర్కొన్నారు. కానీ సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే.. నేను ప్రజలకు ఎలాంటి సేవ చేయలేదని ఎన్నికల్లో ప్రచారం చేశారన్నారు. అది నన్ను చాల బాధించిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు అటెండర్ జాబ్ ఇచ్చినా.. చేస్తానని, పీసీసీ ఎవరికి ఇచ్చినా నాకు అభ్యంతరం లేదన్నారు. రాబోయే పదేళ్లలో ఏదో ఒకరోజు తప్పకుండా పీసీసీ పదవి చేపడాతనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సీఎం కూడా అవుతానని కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పిన మాటలను తాను ఫాలో అవుతానని జగ్గారెడ్డి పేర్కోన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram