Movie Piracy| పైరసీకి నో బ్రేక్..మూవీ రూల్జ్ లో కొత్త సినిమాలు

ఐ బొమ్మ రవి అరెస్టుతో పైరసీ కట్టడిపై ఆశలు పెట్టుకున్న సినీ నిర్మాతలకు షాక్ ఇస్తూ..మూవీ రూల్జ్ వైబ్ సైట్ లో కొత్త సినిమాలు ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది.

Movie Piracy| పైరసీకి నో బ్రేక్..మూవీ రూల్జ్ లో కొత్త సినిమాలు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ సైబర్ క్రైమ్(Telangana Cybercrime) పోలీసులు సినీ పైరసీ(Movie Piracy )వైబ్ సైట్లపై ఉక్కు పాదం మోపుతున్నప్పటికి పైరసీకి బ్రేక్ పడటం లేదు. ఐ బొమ్మ రవి(Ibomma Ravi) అరెస్టుతో పైరసీ కట్టడిపై ఆశలు పెట్టుకున్న సినీ నిర్మాతలకు షాక్ ఇస్తూ..మూవీ రూల్జ్(Movierulz) వైబ్ సైట్ లో కొత్త సినిమాలు ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. సినిమా రిలీజై 24 గంటలు కాక ముందే మూవీ రూల్జ్ లో కొత్త సినిమాలు ప్రత్యక్షమైన తీరు పైరసీ వెబ్ సైట్ల జోరుకు నిదర్శనంగా నిలిచింది. శుక్రవారం రిలీజ్ అయిన ప్రేమంటే, 12A రైల్వే కాలనీ, రాజా వెడ్స్ రాంబాబు సినిమాలు మూవీ రూల్జ్ లో అప్ లోడ్ కాబడ్డాయి. థియేటర్ నుంచి కెమెరా ద్వారా రికార్డు చేసి వెబ్ సైట్లలో అప్ లోడ్ చేశారు.

ఓవైపు ఐబొమ్మ రవి విచారణ కొనసాగుతుండగానే..ఇంకోవైపు పైరసీ వెబ్ సైట్లలో కొత్త సినిమాలు ప్రసారం కావడం సైబర్ క్రైమ్ పోలీసులకు సవాల్ గా మారింది. ఐబొమ్మ వన్, మూవీ రూల్జ్ లు ఎలా కట్టడి చేయాలన్నది ఇప్పుడు పోలీసులకు కొత్త సవాల్ గా ఎదురైంది. అటు యధేచ్ఛగా కొనసాగుతున్న పైరసీ వెబ్ సైట్లతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ సినిమా నిర్మాతాలు వాపోతున్నారు.