న్యాయమైన కోరికలన్ని తీరుస్తా పాలేరు వాసులకు మంత్రి.. పొంగులేటి

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సభలలో పాలేరు నియోజకవర్గం ప్రజలు అడిగిన అన్ని న్యాయమైన కోరికలు తీరుస్తానని, తానిచ్చిన హామీలను నెరవేరుస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

న్యాయమైన కోరికలన్ని తీరుస్తా పాలేరు వాసులకు మంత్రి.. పొంగులేటి

విధాత : అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సభలలో పాలేరు నియోజకవర్గం ప్రజలు అడిగిన అన్ని న్యాయమైన కోరికలు తీరుస్తానని, తానిచ్చిన హామీలను నెరవేరుస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. తన నియోజవకర్గం నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులో ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనేక కష్టాలు, నష్టాలు పడి తనను మంచి మెజారిటీతో గెలిపించారని, మీరిచ్చిన అవకాశంతోనే తాను ఈస్థాయిలో ఉన్నానని పొంగులేటి గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పాలేరు నుంచి అత్యధిక మెజార్టీ రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఏడాది లోపే పాలేరులోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు పూర్తి చేస్తామని హామీనిచ్చారు.

గత బీఆరెస్‌ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో పేదవారికి ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని, అర్హులైన వారికి ఆసరా పెన్షన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని స్పష్టం చేశారు. 22,500కోట్ల ఖర్చుతో ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తామన్నారు. ప్రజల తిరస్కారణకు గురైన బీఆరెస్ పార్టీ కల్లబొల్లి మాటలు మాట్లాడితుందని పొంగులేటి విమర్శించారు. పేదవారిని విస్మరించిన బీఆరెస్‌ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆరెస్‌కు సీట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రోహిణి కార్తెలోనే వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. ఎన్నికల కోడ్ ముగియ్యనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును, ఎన్నికల హామీల అమలును ముమ్మరం చేయనుందని తెలిపారు.