విధాత, హైదరాబాద్ : తెలంగాణ మీ అయ్యా జాగీరా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిలు కౌంటర్ ఇచ్చారు. మిస్టర్ పవన్ కళ్యాణ్ తెలంగాణ మా అయ్య జాగిరే అని, నాలుగు కోట్ల మంది జాగీరే అని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ మాటల్లో అహంకారం కనిపించిందని, తెలంగాణపై ఇంత అక్కసు ఎందుకు అని, పవన్ కళ్యాణ్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని, అతనికి బీజేపీ వాళ్లు సరిగ్గా స్క్రిఫ్టు రాసి ఇవ్వడం లేదు అన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణలో నవనిర్మాణ సంకల్ప సభ పెట్టడం అవసరమా అని, ఇది మీరు విద్వేషాలు రెచ్చగొట్టేందుకే పెట్టారని ఎందుకు అనుకోవద్దు అని పొన్నం ప్రశ్నించారు. గద్దర్ పై పవన్ మాట్లాడిన మాటలను దళిత సంఘాల అంతా ఖండించాలని, పవన్ ఇందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. తెలంగాణ ఎవరైనా రావడానికి పోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు అని, నాలుగు నెలల క్రితం ప్రభుత్వం గెస్ట్ గా పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించిన సంగతి అప్పుడే మర్చిపోయావా అని పొన్నం ప్రశ్నించారు. ఆంధ్ర లోనే గెలవలేని పవన్ కల్యాణ్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడని ఎద్దేవా చేశారు. ఆంధ్రా వాళ్లకు తెలంగాణకు రావద్దని మేము ఎన్నడూ అనలేదు అని, ఇది భారతదేశంలో అంతర్భాగం ఎవరు కాదన్నారు అరని, ఇక్కడ ఆంధ్రా వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు అని, హైదరాబాద్ ఇన్ చార్జ్ మంత్రిగా నేను పునరుద్గాటిస్తున్నానన్నారుే.
తెలంగాణ ప్రజలను అవమానించడం మానుకోవాలి
పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడారని, కోనసీమకు తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందని, విభజన సక్రమంగా లేదని మాట్లడినందుకు ఆయన వివరణ ఇచ్చుకోవాలని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణపై ప్రేమ ఉంటే 12ఏళ్లు ఎక్కడా పోయావు అని, ఇప్పుడు వచ్చి నాటకాలు ఎందుకు అని ప్రశ్నించారు. నీవు ఎక్కడైన పార్టీ పెట్టుకో పోటీ చేసుకో, గుజరాత్ లో పెట్టుకో ఎవరు వద్దన్నారన్నారు. ఏపీలో వచ్చేసారికి అధికారం దక్కదన్న ఆలోచనతో తెలంగాణలో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడని, సినిమాలు ఫెయిలై డిప్రెషన్ లో ఉన్నాడని అనిరుద్ విమర్శించారు. అసలు పవన్ కల్యాణ్ పనిచేసిన వారి అన్నచిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైందని, చిరంజీవిని రాజ్యసభ సభ్యుడిని, కేంద్ర మంత్రిని కాంగ్రెస్ చేసిందని గుర్తు చేశారు.
ఆంధ్రలో అధికారంలోకి వచ్చాక అక్కడే నీవు ఏం చేయలేదని, డిప్యూటీ సీఎంగా నీవు ఆంధ్రలో, తెలంగాణలో ఎన్ని రోజులు ఉన్నావో చెప్పాలని పవన్ కల్యాణ్ ను అనిరుధ్ డిమాండ్ చేశారు. కొండగట్టుకు నిధులు ఇచ్చానంటూ దేవుడికి ఇచ్చిన పైసల్ కూడా చెప్పుకోవడం దారుణం అన్నారు. బీజేపీని మెప్పించేందుకే పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నట్లుగా ఉందన్నారు. జన్వాడలో పవన్ కల్యాణ్ ఆక్రమించిన భూమి చెరువు భూమి అని, ఓక పంట వేసుకునే శిఖం అసైన్డ్ భూమి అని, దానిలోకి ఎవరిని రావద్దని, కేసులు పెడుతామని బెదిరించడం ఎందుకు అని అనిరుధ్ ప్రశ్నించారు.
