Prashant Kishor : వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓటమి ఖాయం
ప్రశాంత్ కిషోర్ అభిప్రాయంలో వచ్చే ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటమి ఖాయం, రాహుల్-మోడీ కూడా రక్షించలేరు అని తెలిపారు.

హైదరాబాద్, అక్టోబర్ 03 (విధాత): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎన్నికల వ్యూహకర్త, జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ.. రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ, మోడీ కాదు కదా ఎవరూ కాపడలేరని వెల్లడించారు.
రేవంత్ రెడ్డి బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్లీ ఇంకోసారి గెలవడని పేర్కొన్నారు. బీహార్ ప్రజల DNA తెలంగాణ ప్రజల DNA కంటే తక్కువ అయినప్పుడు, ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని నన్ను మూడు సార్లు ఎందుకు అడిగాడని ప్రశ్నించారు.