Rains | తెలంగాణ‌కు వ‌ర్ష సూచ‌న‌.. నేడు, రేపు వ‌డ‌గ‌ళ్ల వాన‌లు..!

Rains | తెలంగాణ( Telangana ) వ్యాప్తంగా ఎండ‌లు( Summer ) మండిపోతున్న విష‌యం తెలిసిందే. భారీగా న‌మోద‌వుతున్న ఉష్ణోగ్ర‌త‌ల‌కు( Temperature ) జ‌నాలు బేంబెలెత్తిపోతున్నారు.

Rains | తెలంగాణ‌కు వ‌ర్ష సూచ‌న‌.. నేడు, రేపు వ‌డ‌గ‌ళ్ల వాన‌లు..!

Rains | హైద‌రాబాద్ : తెలంగాణ( Telangana ) వ్యాప్తంగా ఎండ‌లు( Summer ) మండిపోతున్న విష‌యం తెలిసిందే. భారీగా న‌మోద‌వుతున్న ఉష్ణోగ్ర‌త‌ల‌కు( Temperature ) జ‌నాలు బేంబెలెత్తిపోతున్నారు. మండుటెండ‌లకు ఆగ‌మైపోతున్న ప్ర‌జ‌ల‌కు హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం( IMD Hyderabad ) చ‌ల్ల‌ని క‌బురు అందించింది.

ఈ నెల 21, 22 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు( Rains ) కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం( Whether Center ) తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో పాటు వ‌డ‌గ‌ళ్ల వానలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల‌, జగిత్యాల‌, సిరిసిల్ల‌, పెద్ద‌ప‌ల్లి, క‌రీంన‌గ‌ర్, భూపాల‌ప‌ల్లి జిల్లాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

ఇక నిర్మ‌ల్, నిజామాబాద్, మ‌హ‌బూబాబాద్, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, సంగారెడ్డి, మెద‌క్, కామారెడ్డి జిల్లాల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. దీంతో ఆయా జిల్లాల ప్ర‌జ‌లు ఎండ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందే అవ‌కాశం ఉంది. అయితే వ‌రి, మామిడి పంట రైతులు మాత్రం కాస్త ఆందోళ‌న‌లో ఉన్నారు. వ‌డ‌గ‌ళ్ల వాన కురిస్తే పంట‌కు తీవ్ర న‌ష్టం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు.