Chamakura Mallareddy | రాజగోపాల్..ఎప్పుడు హోం మినిస్టర్ అవుతున్నావ్‌ ,బీఆరెస్ ఎమ్మెల్యేల ప్రశ్న..ఆసక్తికరంగా సాగిన సంభాషణ

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ల్యాబీల్లో తారసడిపన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది.

Chamakura Mallareddy | రాజగోపాల్..ఎప్పుడు హోం మినిస్టర్ అవుతున్నావ్‌ ,బీఆరెస్ ఎమ్మెల్యేల ప్రశ్న..ఆసక్తికరంగా సాగిన సంభాషణ

విధాత, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ల్యాబీల్లో తారసడిపన మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. రాజగోపాల్‌రెడ్డిని చూసిన ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మర్రి రాజశేఖర్ రెడ్డి కంగ్రాట్స్ హోమ్ మినిస్టర్ అని పలకరించారు. ఎప్పుడు హోంమినిస్టర్ అవుతున్నావ్ అంటూ మల్లారెడ్డి పలికరిస్తూ మా ప్రభుత్వం ఉంటే నేనే హోం మినిష్టర్ అయ్యేవాన్ని… మీ ప్రభుత్వం ఉంది నీవేప్పుడు అవుతున్నావ్ అని సరదాగా ప్రశ్నించారు. రాజగోపాల్‌రెడ్డి స్పందిస్తూ టైం వస్తుందని, హోంమంత్రి అవుతానని,అది ప్రజల్లోయించి వస్తున్న డిమాండ్ అని, ప్రతిపక్షాలు కూడా కోరుకుంటున్నారన్నారు. నేను హోమ్ మినిస్టర్ ఐతే బీఆరెస్‌ అవినీతి లెక్కలు తెలుస్తా..? అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయన్నారు. మీ బాస్ కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదని బీఆరెస్ ఎమ్మెల్యేలను రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. వస్తాడు అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బదులిచ్చారు.
మీ ఎమ్మేల్యేలు అంతా మా పార్టీలో చేరుతున్నారని, వారికి మనోధైర్యం కల్పించడానికి అయిన రావాలి కదా అని అన్న రాజగోపాల్ వ్యాఖ్యానించారు. మేము కూడా మీ లాగే ఆపరేషన్ మొదలు పెట్టామని, 15 నుంచి 20 మందితో మాట్లాడుతున్నామన్నారు. కేసిఆర్ ఖచ్చితంగా వస్తాడు.. అయినా మేము చాలు మీకు అన్న ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాఎమ్మేల్యేలు 12 మంది తీసుకున్నారని, 24 మందికి తీసుకోవాలనే మా టార్గెట్.. ఎల్పీ విలీనం చేసుకుంటామన్న రాజ గోపాల్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. అది సాధ్యం కాదు అని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రశాంత్ రెడ్డికి రేటు కట్టలేక పోతున్నాం.. ఈయనది లాయల్ కోటా… కేసీఆర్ ను విడిచి రాడు…అందుకే వదిలేశాం. టైం వేస్ట్ అని రాజగోపాల్ రెడ్డి హాస్యోక్తులు వేశారు. ఎంత రేటు కడుతున్నారని ప్రశాంత్‌రెడ్డి అడుగగా, మీ అంత మేము ఇవ్వలేం అన్నా.. మాది 5 నుంచి 10 అంతే అని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. నువ్వే మా వెైపు రా హోమ్ మినిస్టర్ ఇప్పిస్తామని బీఆరెస్ ఎమ్మెల్యేలు ఆఫర్ ఇచ్చారు. జగదీష్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తున్నాడా అన్న జర్నలిస్టుల ప్రశ్నకు..ఆయన వస్తె కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆరెస్‌కు పోతారన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. పోచారంను సభలో ఎవరు పట్టించుకోవడం లేదు బాధ అనిపించిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన అప్పుడు మా ఎమ్మెల్యేలను జాయినింగ్ లో స్పీకర్ గా ఉన్నాడని, ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి పాపాన్ని ప్రాయచిత్తం చేసుకున్నాడని రాజగోపాల్ రెడ్డి చమత్కరించారు. రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసినా సందర్భాన్ని గుర్తు చేసుకున్న రాజగోపాల్‌రెడ్డి అప్పుడు కేసీఆర్‌ వందల కోట్లు ఖర్చు చేశారని, నైతిక విజయం నాదేనన్నారు. నీవు ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే కోసం పైసలే చల్లావ్…మేము నీ మీద అదే చేశాం అని ప్రశాంత్‌రెడ్డి బదులిచ్చారు. నా ఫోన్ ట్యాప్ చేశారు..రికార్డులు అన్ని బయట పెడతానని, అవినీతి పరులను వదలబోనని రాజ గోపాల్ రెడ్డి చెప్పగా, హోమ్ మినిస్టర్ అయి అన్ని ఆధారాలు బయటపెట్టు..చూస్తామని బీఆరెస్ ఎమ్మెల్యేలు బదులిచ్చారు.
బీఆరెస్‌లో కూడా మంచి ఎమ్మెల్యేలు ఉన్నారని, వారి జోలికి రానని, మీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తనకు దగ్గరి బంధువు అని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. నీది సీ స్థాయి అన్న బీఆరెస్‌ ఎమ్మెల్యేలు చెప్పగా, ఏదో రోజు సీఎం కూడా ఐతా నాకేం తక్కువ అని రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి జి. జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లే వ్యక్తి అంటూ అక్కడి నుంచి రాజగోపాల్‌రెడ్డి ముందుకు కదిలారు