ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. మూసీ నదిపై గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు
ఈ సందర్బంగా రాజ్ నాథ్ తో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల మంజూరీ అంశాలపై రేవంత్ చర్చించారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి సంబంధించి భూసేకరణకు, యుటిలిటీస్ బదలాయింపు వంటి అంశాల్లో సహకారం అందిస్తామన్నారు. ఇది దేశ సమగ్రత, రక్షణకు సంబంధించిన అంశమైనందున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డీఆర్డీవో/డీఆర్‌డీఎల్ ఎంచుకున్న ప్రదేశంలో వారికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్ట్‌ను త్వరగా మంజూరు చేయాలని కేంద్రమంత్రికి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
సాయంత్రం రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ కానున్నారు.
