అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఇస్తా.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ హామీ

  • Publish Date - October 17, 2023 / 11:07 AM IST

విధాత : కాంగ్రెస్ అధికారంలో రాగానే నీకు తొలి ఉద్యోగం ఇస్తామని నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు(మరుగుజ్జు) రజినికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 9వ తేదీన ఏల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారానికి రావాలని రజినిని కోరారు.


మంగళవారం గాంధీ భవన్‌లో రేవంత్‌ను కలిసిన రజిని తన సమస్యను రేవంత్‌కు నివేదించారు. పీజీ పూర్తి చేసిన ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థల్లో మరుగుజ్జునని ఉద్యోగం ఇవ్వడం లేదని రజిని తన ఆవేదనను రేవంత్‌కు తెలిపారు. 



స్పందించిన రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని, డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియం కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని, దీనికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలు వస్తారని, ఆరోజు నీవు అక్కడకు రావాలని, నీ అర్హత మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగాన్ని నీకే ఇస్తుందని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ స్కీముల కార్డుపై రేవంత్‌ స్వయంగా తన దస్తూరీతో దివ్యంగురాలి వివరాలు నమోదు చేసుకున్నారు.