Revanth Reddy Met All India Prison Duty Meet Winners | ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందన

ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్‌లో 28 పతకాలు సాధించిన తెలంగాణ పోలీస్ క్రీడాకారులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

Revanth Reddy Met All India Prison Duty Meet Winners |  ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందన

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ లో ఈ నెల 9నుంచి 11వరకు తెలంగాణ పోలీస్‌ అకాడమీలో జరిగిన 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ -2025 క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన తెలంగాణ పోలీస్ క్రీడాకారులు, అధికారులు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీస్ జట్లు ఈ పోటీలలో వివిధ విభాగాల్లో 133 పతకాల కోసం పోటీ పడ్డాయి. ఇందుల తెలంగాణ పోలీస్ శాఖ క్రీడాకారులు 28 పతకాలు ( 21 బంగారు, 4 రజతం, 3 కాంస్యం) కైవసం చేసుకున్నారు. డ్యూటీ మీట్‌లో ఓవరాల్‌ చాంపియన్‌గా తెలంగాణ జైళ్ల శాఖ నిలిచింది. విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

ఈ కార్యక్రమంలో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిరవి గుప్తా, జైళ్ల విభాగం డీజీ సౌమ్య మిశ్రా, ఐజీ మురళి బాబు, వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్, ఎస్పీలు శివ కుమార్ గౌడ్, కళాసాగర్, డ్యూటీ మీట్ పోటీ విజేతలు పాల్గొన్నారు.