Gold Rates | భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు.. హైద‌రాబాద్‌లో తులం ఎంతంటే..?

Gold Rates | ప‌సిడి ప్రియులారా( Gold Lovers ).. బంగారం ధ‌ర‌లు( gold rates ) ప‌రుగులు పెడుతున్నాయి. కొందామంటే కూడా అంద‌నంత దూరంలో ప‌సిడి ధ‌ర‌లు ఉన్నాయి. తాజాగా మంగ‌ళ‌వారం కూడా బంగారం ధ‌ర‌లు భ‌గ్గుమ‌న్నాయి. దీంతో గోల్డ్ ల‌వ‌ర్స్ ల‌బోదిబోమంటున్నారు.

Gold Rates | భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు.. హైద‌రాబాద్‌లో తులం ఎంతంటే..?

Gold Rates | హైద‌రాబాద్ : బంగారం ధ‌ర‌లు( Gold Rates ) భ‌గ్గుమంటున్నాయి. గోల్డ్ ల‌వ‌ర్స్‌( Gold Lovers )కు బంగారం ధ‌ర‌లు ముచ్చెట‌మ‌లు ప‌ట్టిస్తున్నాయి. ప‌సిడి ధర‌లు ప‌రుగులు పెడుతుండ‌డంతో కొనుగోలుదారులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. తాజాగా మ‌రోసారి బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగిపోయాయి.

భారీగా పెరిగిన ధ‌ర‌ల నేప‌థ్యంలో హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రూ.870 పెరిగి రూ.లక్షా 12 వేలకు చేరింది తులం బంగారం ధ‌ర‌. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,11,930, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,600లుగా ఉంది. కేజీ వెండి ధ‌ర రూ. ల‌క్షా 44 వేల‌కు చేరింది.