Revanth Reddy Palamuru Project | మా ప్రాజెక్టులకు అడ్డుపడితే పోరాటమే : జటప్రోలు సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
అధికారంలోకి వచ్చిన 10 నెలలు కాకపోతే దిగిపో దిగిపో అంటున్నారని.. ఇది అడుక్కుంటే వచ్చింది కాదన్నారు. బరిగీసి కొట్లాడితే తామంతా కుర్చీల్లో కూర్చున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ఉచిత కరెంట్ గురించి కేసీఆర్ తమకు చెప్పాలా.. ఉచిత విద్యుత్ గురించి ప్రవేశ పెట్టిందే కాంగ్రెసేనని రేవంత్ చెప్పారు.

Revanth Reddy Palamuru Project | విధాత, వనపర్తి ప్రతినిధి జూలై 18 : తమ ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు సహకరించకపోతే పోరాటం తప్పదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. వెనుక బడిన పాలమూరును ప్రపంచానికే ఆదర్శంగా నిలబెడుతానని హామినిచ్చారు. శుక్రవారం కొల్లాపూర్ తాలూకా పెంట్లవెళ్లి మండలం జటప్రోల్ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. అంతకు ముందు సీఎం జటప్రోల్ లో ని మదనగోపాల స్వామి ని దర్శించుకున్నారు. అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంఖు స్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలోని ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. అదే సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని విరమించుకోవాలని విజ్జప్తి చేశారు. పాలమూరు రంగారెడ్డిని అడ్డుకోవడం న్యాయమా ఆలోచించాలన్నారు. రెండు రాష్ట్రాలను సమానంగా చూడాలని ఆయన చంద్రబాబును కోరారు.
కేసీఆర్ ను పాలమూరు ప్రజలు పార్లమెంట్ కు పంపించారని, తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు ఆయన పార్లమెంట్ కు కూడా వెళ్లలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.
పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు పాలమూరు ప్రజలను కేసీఆర్ ఎందుకు ఆదుకోలేదని ఆయన ప్రశ్నించారు. పాలమూరుకు కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. పాలమూరు అంటేనే కేసీఆర్ కుటుంబానికి చిన్న చూపు అని రేవంత్ అన్నారు. తన ఇల్లు అమ్మైనా వరద బాధితులకు ఇళ్లు కటిస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రేవంత్ గుర్తు చేశారు. పదేళ్లు సీఎంగా ఉండి పాలమూరుకు సున్నం పెట్టారన్నారని కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. తాము చేపలు పట్టాలి.. చెప్పులు కుట్టుకోవాలి.. మీరూ మీ కుటుంబం రాజ్యాలు ఏలాలా అని ఆయన ప్రశ్నించారు. ప్రజా పాలన చూసి కేసీఆర్ కు దు:ఖం వస్తోందని ఎద్దేవా చేశారు. తమ పిల్లలు ఎందుకు చదువుకోవద్దు.. ఎందుకు రాజ్యాలు ఏలోద్దో చెప్పాలన్నారు. కేసీఆర్ మనవళ్లతో సమానంగా దళిత పిల్లలు చదువుకుంటే దు:ఖం వస్తోందా..ఎస్సీ వర్గీకరణ చేసినందుకు దు:ఖం వస్తోందా అని ఆయన ప్రశ్నించారు. పదేళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు నిర్మించలేదని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. ఒక్క కాళేశ్వరంపైనే లక్ష కోట్లు ఖర్చు పెట్టి కడితే 2023లో కూలిపోయిందని సెటైర్లు వేశారు. పాలమూరు పచ్చగా మారుతుంటే.. తమ పొలాల్లో కృష్ణా నీళ్లు పారుతుంటే తట్టుకోలేక కేసీఆర్ విషం చిమ్ముతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన 10 నెలలు కాకపోతే దిగిపో దిగిపో అంటున్నారని.. ఇది అడుక్కుంటే వచ్చింది కాదన్నారు. బరిగీసి కొట్లాడితే తామంతా కుర్చీల్లో కూర్చున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ఉచిత కరెంట్ గురించి కేసీఆర్ తమకు చెప్పాలా.. ఉచిత విద్యుత్ గురించి ప్రవేశ పెట్టిందే కాంగ్రెసేనని రేవంత్ చెప్పారు. మొదటి ఏడాదిలోనే రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులు సంతోషంగా ఉంటే కడుపుమంటతో దు:ఖం వస్తోందా అని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లు కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.