సీఎంను కలిసిన రెవెన్యూ అధికారుల జేఏసీ బృందం

తెలంగాణ రెవెన్యూ అధికారుల జేఏసీ బృందం ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్ర ప్రభుత్వ పాలనను

సీఎంను కలిసిన రెవెన్యూ అధికారుల జేఏసీ బృందం

విధాత : తెలంగాణ రెవెన్యూ అధికారుల జేఏసీ బృందం ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్ర ప్రభుత్వ పాలనను సమర్ధవంతమైన పాలన అందించేందుకు తమ ఉద్యోగ సంఘాలుగా మద్దతుగా నిలుస్తాయన్నారు. గత ప్రభుత్వం తమ సమస్యల పట్ల ఏనాడు స్పందించిన దాఖలాలు లేవని, తను చెప్పిందే వేధంగా అనుసరించి అన్ని రంగాల ప్రజలను ప్రభుత్వ ఉద్యోగులను దూరం పెట్టిందన్నారు. ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రజా ప్రభుత్వంలో ప్రజలను, ప్రభుత్వ ఉద్యోగులను ఎప్పటికప్పుడు కలుసుకుంటూ వారి సమస్యలను వింటూ నిజమైన ప్రజా ప్రభుత్వంగా సాగుతుండటం అభినందనీయమన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టినటువంటి గ్రామ పరిపాలన వ్యవస్థను పునర్నిర్మాణం చేయడానికి గ్రామ రెవెన్యూ అధికారులతో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయలన్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దయినప్పటి నుండి ఇప్పటివరకు అన్యాక్రాంతమై కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల వివరాలన్నీ సీఎం రేవంత్‌రెడ్డికి అందచేశారు. గత ప్రభుత్వం అనాలోచిత విధానంతో గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దుచేసి ప్రజలకు అనేక ఇబ్బందులను గురిచేసిందని, దరిద్రమైన ధరణి వెబ్సైట్ ద్వారా ఖరీదైన భూముల వివరాలన్నీ అన్యక్రాంతం చేశారని వివరాల్లో పేర్కోన్నారు. సీఎంను కలిసిన వారిలో జేఏసీ నాయకులు పల్లెపాటి నరేష్ అడిషనల్ సెక్రెటరీ జనరల్వైస్ చైర్మన్, సర్వేశ్, చింతల మురళి, ప్రతిభ, రాజమల్లు, శ్రీరామరమేష్, మాతృ నాయక్, నరసింహ రెడ్డి, మహేష్, మేకల రమేష్, సుదర్శన్, రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.