Hyderabad | మహిళలపై అసభ్య ప్రవర్తన.. సీఐపై వేటు
రక్షణ కోసం వచ్చే మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్న ఖాకీచకుడు సనత్ నగర్ ఇన్ స్పెక్టర్ పురెందర్‌రెడ్డిపై సస్పెండ్ వేటు పడింది. పోలీస్ స్టేషన్‌లో తన సమస్యపై ఫిర్యాదు చేసిన మహిళ పట్ల అసభ్య చాటింగ్ చేసిన పురెందర్‌రెడ్డి వ్యవహారంపై బాధిత మహిళ సీపీని ఆశ్రయించింది

విధాత, హైదరాబాద్ : రక్షణ కోసం వచ్చే మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్న ఖాకీచకుడు సనత్ నగర్ ఇన్ స్పెక్టర్ పురెందర్‌రెడ్డిపై సస్పెండ్ వేటు పడింది. పోలీస్ స్టేషన్‌లో తన సమస్యపై ఫిర్యాదు చేసిన మహిళ పట్ల అసభ్య చాటింగ్ చేసిన పురెందర్‌రెడ్డి వ్యవహారంపై బాధిత మహిళ సీపీని ఆశ్రయించింది. తనతో సీఐ చేసిన అసభ్య చాటింగ్ వివరాలను అందించింది.
అందంగా ఉన్నావు, చెప్పిన ప్లేస్ కి రావాలి అంటూ సీఐ చేసిన మెసేజ్‌లను చూపించింది. విచారణ నిర్వహించిన సైబరాబాద్ సీపీ ఈ వ్యవహారంలో పురెందర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కాలంలో తెలంగాణలో పలు పోలీస్ స్టేషన్లలో ఈ రకమైన ఘటనలు తరుచు వెలుగులోకి వస్తుండటం పోలీస్ శాఖ ప్రతిష్టకు సవాల్‌గా తయారవుతున్నాయి.