Sarpanch As Bear : ఎన్నికల హామీ అమలు కోసం.. కొత్త సర్పంచ్ ఎలుగుబంటి వేషం

నిర్మల్ జిల్లా లింగాపూర్ సర్పంచ్ రంజిత్ తన ఎన్నికల హామీని వినూత్నంగా నెరవేర్చారు. గ్రామంలో కోతుల బెడదను తప్పించేందుకు తనే స్వయంగా ఎలుగుబంటి వేషం వేసి వాటిని తరిమికొట్టారు.

Sarpanch As Bear : ఎన్నికల హామీ అమలు కోసం.. కొత్త సర్పంచ్ ఎలుగుబంటి వేషం

విధాత : సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్తులకు ఇచ్చిన హామీ కోసం కొత్తగా ఎన్నికైన ఓ యువ సర్పంచ్
ఎలుగుబంటి వేషం కట్టిన వీడియో వైరల్ గా మారింది. ఎలుగుబంటి వేషం కట్టి ఎగురుతూ.. దూకుతూ కోతులను తరిమేస్తున్న ఈ వ్యక్తి ఎవరో కాదండోయ్..తెలంగాణ నిర్మల్ జిల్లా లింగాపూర్ గ్రామానికి తాజాగా ఎన్నికైన సర్పంచ్ కుమ్మరి రంజిత్. సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్తులకు సమస్యగా మారిన కోతుల బెడద అరికడుతానని బీఆర్ఎస్ కు చెందిన యువ సర్పంచ్ రంజీత్ హామీ ఇచ్చాడు.

గెలిచిన వెంటనే తన ఎన్నికల హామీ అమలు కోసం నేరుగా తనే కార్యరంగంలోకి దూకేశాడు. కోతులను పట్టించేందుకు పంచాయతీలో నిధులు లేకపోవడం, సొంతంగా డబ్బులు పెట్టుకోవడం భారం అనుకున్న రంజిత్ కోతులను తరిమేసేందుకు వినూత్నంగా ఆలోచన చేశాడు. కోతులను తరిమేసే ఎత్తుగడలో భాగంగా తనే స్వయంగా ఎలుగుబంటి వేషం ధరించాడు. గ్రామంలోని కోతులను తన ఎలుగుబంటి వేషంతో భయపెట్టి తరిమేసే పని మొదలు పెట్టాడు. తాత్కాలికంగా అయినా ఎలుగుబంటి వేషంతో గ్రామస్తులకు సమస్యగా తయారైన కోతుల సమస్యకు చెక్ పెట్టడంతో సఫలమయ్యాడు. గ్రామస్తులు కూడా ఈ వినూత్న ప్రయత్నంతో సంతోషంగా ఉన్నారు.

అయితే కోతుల బెడద అనేది తెలంగాణలోని అనేక గ్రామాల్లో తీవ్రమైన సమస్యగా కొనసాగుతుంది. ఈ అంశాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా సీరియస్‌గా తీసుకుని పరిష్కార దిశగా పనిచేస్తే ప్రజల మనసులు, ఓట్లు గెలుచుకోవచ్చు. రానురాను ఇది ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఒక కీలక అంశంగా మారిన అశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి :

Underwater Bharatanatyam : సముద్రం అడుగున బాలికల భరత నాట్య ప్రద్శరన..వైరల్ వీడియో
Silver Gold Price : వెండి ధర రూ.5వేల పెంపు..పసిడి నిలకడ