Rains | రాష్ట్రంలో ఇవాళ, రేపు వర్షాలు.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
Rains | రాష్ట్రంలో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తమిళనాడులో ఏర్పడిన ఉపరితల ద్రోణి తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించిందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

Rains : రాష్ట్రంలో శని, ఆదివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తమిళనాడులో ఏర్పడిన ఉపరితల ద్రోణి తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించిందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
శుక్రవారం నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట, ఆసిఫాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షం కురిసింది. వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
రాష్ట్రంలో 2023 జూన్ 1 నుంచి మే 10 వరకు 5 శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్ పేర్కొంది. 2023 జూన్ 1 నుంచి 2024 మే 10 వరకు సాధారణ వర్షపాతం 899.1 మి.మీ కురవాల్సి ఉండగా.. 948 మి.మీ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది.