Srisailam | శ్రీశైలం జ‌లాశ‌యానికి పోటెత్తిన వ‌ర‌ద‌.. ఏడు గేట్లు ఎత్తివేత‌

Srisailam | కృష్ణా న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు జూరాల నుంచి శ్రీశైలం జ‌లాశ‌యానికి కృష్ణ‌మ్మ ఉర‌క‌లేస్తుంది. ఈ క్ర‌మంలో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండ‌లా మారింది.

  • By: raj |    telangana |    Published on : Aug 14, 2025 9:36 AM IST
Srisailam | శ్రీశైలం జ‌లాశ‌యానికి పోటెత్తిన వ‌ర‌ద‌.. ఏడు గేట్లు ఎత్తివేత‌

Srisailam | కృష్ణా న‌ది ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు జూరాల నుంచి శ్రీశైలం జ‌లాశ‌యానికి కృష్ణ‌మ్మ ఉర‌క‌లేస్తుంది. ఈ క్ర‌మంలో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండ‌లా మారింది. భారీ వ‌ర‌ద నేప‌థ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు ఏడు రేడియ‌ల్ క్ర‌స్ట్ గేట్ల‌ను 10 అడుగుల మేర ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. ఈ ప్ర‌వాహం నాగార్జున సాగ‌ర్‌కు త‌ర‌లివెళ్తుంది.

శ్రీశైలం స్పిల్ వే ద్వారా 1,87,208 క్యూసెక్కుల నీటిని, కుడి, ఎడ‌మ‌గ‌ట్టు జ‌ల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తూ 65,632 క్యూసెక్కుల నీటిని అద‌నంగా సాగ‌ర్‌కు విడుద‌ల చేస్తున్నారు. సాగ‌ర్‌కు భారీగా వ‌ర‌ద వ‌చ్చి చేరుతుండ‌డంతో ఆ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తేశారు.

ఇక శ్రీశైలానికి జూరాల‌, సుంకేసుల నుంచి 1,17,221 క్యూసెక్కుల నీరు వ‌చ్చి చేరుతోంది. శ్రీశైలం జ‌లాశ‌యం నీటిమ‌ట్టం ప్ర‌స్తుతం 882.10 అడుగులు కాగా, నీటినిల్వ 199.2737 టీఎంసీలుగా న‌మోదైంది.