తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడిగా శంకర్ రాంబాబు బాధ్యతల స్వీకరణ
అభినందనలు తెలిపిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి ,నల్లగొండ, దేవరకొండ శాసనసభ్యులు గాదరి కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు బుదవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరబాద్‌లోని ఎస్సీ కమిషన్ కార్యాలయంలో మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే లు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్ ,కుటుంబ సభ్యుల సమక్షంలో జిల్లా శంకర్, రాంబాబు నాయక్ లు బాధ్యతలను స్వీకరించారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషన్ సభ్యులకు మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డి తొ పాటు ఎమ్మెల్యే లు,పలువురు శుభాకాంక్షలు తెలిపారు.సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు ఎస్సీ కమిషన్ దిగ్విజయంగా పనిచేయాలని మంత్రి సూచించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎస్సీ , ఎస్టీ వర్గాల సమగ్ర వికాసం, అభ్యున్నతికి చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి నిర్ధిష్టమైన సూచనలను ఇవ్వాలన్నారు. అనంతరం వారిరువూరికి శుభాకాంక్షలు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram