Smita Sabharwal | మరోసారి వార్తలకెక్కిన స్మితా సబర్వాల్
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఆమె చేసిన ఓ ట్వీట్ కొత్త వివాదానికి తెరలేపింది.

సివిల్ సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై ఎందుకని ప్రశ్నించిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్
సబర్వాల్ పై వివిధ వర్గాల నుంచి మాటల దాడి.. విభిన్నంగా స్పందించిన నెటిజన్లు..
అవగాహన లేని వ్యాఖ్యలన్న సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్..
విధాత, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మరోసారి వార్తల్లోకెక్కారు. ఆమె చేసిన ఓ ట్వీట్ కొత్త వివాదానికి తెరలేపింది. నకిలీ వైకల్యం సర్టిఫికెట్‌తో సివిల్స్ సర్వీస్ జాబ్‌లో ప్రవేశించారని పూజా ఖేద్కర్ అనే ట్రైనీ ఐఏఎస్ అధికారి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమె ఇదే ఇష్యూపై స్పదించారు. కానీ ఆమె ఏకంగా సివిల్ సర్వీసుల్లో దివ్యాంగులకు కోటా ఎందుకని ప్రశ్నించడం ఇక్కడ వివాదమై కూర్చుంది. దీనిపై చాలా వర్గాల నుంచి వ్యతిరేక కామెంట్లను ఎదుర్కొన్నారు స్మితా.
సుప్రీంకోర్డు సీనియర్ అడ్వకేట్ కరుణ స్పందిస్తూ.. వైకల్యం గురించి ఐఏఎస్ ఆఫీసర్‌కు అవగాహన లేదని విమర్శించారు. చాలా వైకల్యాలు శక్తి సామర్థ్యాలు, తెలివితేటలపై ప్రభావం చూపవు కానీ మీ ట్వీట్ జ్ఞానోదయం, వైవిధ్యం చాలా అవసరమని చూపిస్తుందని చురకలంటించారు. ఇది చాలా దయనీయమైన మినహాయింపు కలిగిన అభిప్రాయమని శివసేన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది విమర్శించారు.
సివిల్ సర్వీసు ఉద్యోగాలకు ఫీల్డ్ వర్క్, ప్రజల మనోవేదనలను నేరుగా వినడం, శారీరక దృఢత్వం అవసరమని స్మితా అభిప్రాయపడ్డారు. వైక్యలం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్ నియమించుకుంటుందా? అని ప్రశ్నించారు. ఈ ట్వీట్‌కు ఓ నెటిజన్ స్పందిస్తూ అఖిల భారత సర్వీసు ఉద్యోగుల పిల్లలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎందుకివ్వాలి? అని కామెంట్ చేయగా, అవును.. ఇవ్వొద్దు అని ఆమె బదులిచ్చారు.
యూపీఎస్సీ చైర్మన్ పదివికి మనోజ్ సోనీ రాజీనామా చేయడంపై ఆమె స్పందించారు. ఇది బాధ్యతరాహిత్యమైన చర్య అన్నారు. అనేక మంది నెటిజన్లు స్మిత ట్వీట్‌పై విభిన్నంగా స్పందించారు. చాలా మందికి ఆమె ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు నెట్టింట ఇది వైరల్ అవుతోంది. మరోసారి స్మిత ఇలా వార్తల్లోకెక్కారు.
As this debate is blowing up-
With all due respect to the Differently Abled. 🫡
Does an Airline hire a pilot with disability? Or would you trust a surgeon with a disability.The nature of the #AIS ( IAS/IPS/IFoS) is field-work, long taxing hours, listening first hand to…
— Smita Sabharwal (@SmitaSabharwal) July 21, 2024