IAS Smita Sabharwal | స్మితా సభర్వాల్ కు హైకోర్టు లో ఊరట
కాళేశ్వరం కేసులో ఐఏఎస్ స్మితా సభర్వాల్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట, కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోరాదని స్పష్టం.

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ వ్యవహారంలో ఐఏఎస్ స్మితా సభర్వాల్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని ఆమె కోర్టులో సవాల్ చేశారు. ఆ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరారు.
స్మితా సభర్వాల్ పిటిషన్ విచారించిన హైకోర్టు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా స్మితా సభర్వాల్‌పై చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే దాఖలైన పిటీషన్లతో కలిపి ఈ కేసును విచారిస్తున్నట్లుగా పేర్కొంది. తదుపరి విచారణ వాయిదా వేసింది.