Software Engineer | కరీంనగర్ జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
Software Engineer | ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన స్నేహితుడితో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా, ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. స్నేహితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు.

Software Engineer | హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(23) మృతి చెందింది. ఆమె స్నేహితుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గంగాధరకు చెందిన ఇప్పలపల్లి రవళిక హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తుంది. ఆమె తన స్నేహితుడితో కలిసి హైదరాబాద్ నుంచి గంగాధరకు వస్తుండగా, తిమ్మాపూర్ మండల పరిధిలోని అలుగునూరు వద్ద వారి బైక్ ప్రమాదానికి గురైంది. దీంతో రవళిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, స్నేహితుడు వెంకటసాయి తీవ్ర గాయాలపాలయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వెంకటసాయిది కూడా గంగాధర గ్రామం అని పోలీసులు తెలిపారు. అయితే తాను హైదరాబాద్ నుంచి బస్సులో బయల్దేరినట్లు తన తల్లిదండ్రులకు రవళిక చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. కానీ ఆమె బైక్‌పై తన స్నేహితుడితో కలిసి వచ్చినట్లు తేలింది. మృతురాలి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.