Sound Pollution | హైద‌రాబాద్‌లో గ‌ణ‌నీయంగా పెరిగిన శబ్ద కాలుష్యం..! కార‌ణాలు ఇవే..!!

Sound Pollution | పండుగ‌లు( festivals ) ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లిగించేలా నిర్వ‌హించ‌కూడ‌దు. శాంతియుతంగా, ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు. కానీ ఈ ఏడాది గ‌ణేష్ చ‌తుర్థి( Ganesh Chaturthi ) సంద‌ర్భంగా.. ప‌రిమితికి మించి డీజే సౌండ్ల‌( DJ Sounds )ను ఉప‌యోగించారు. హైద‌రాబాద్( Hyderabad ) మ‌హా న‌గ‌రంలో సాధార‌ణ ప‌రిమితుల‌కు మించి శ‌బ్ద కాలుష్యం( Sound Pollution ) న‌మోదైంది.

Sound Pollution | హైద‌రాబాద్‌లో గ‌ణ‌నీయంగా పెరిగిన శబ్ద కాలుష్యం..! కార‌ణాలు ఇవే..!!

హైద‌రాబాద్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్( Hyderabad ) మ‌హా న‌గ‌రంలో శబ్ద కాలుష్యం గ‌ణ‌నీయంగా పెరిగిన‌ట్లు తెలంగాణ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు( Telangana Pollution Control Board ) వెల్ల‌డించింది. నివాస ప్రాంతాల‌తో పాటు సున్నిత ప్రాంతాల్లో ప‌రిమితికి మించి శబ్ద కాలుష్యం( Sound Pollution ) పెరిగింది. 11 రోజుల పాటు నిర్వ‌హించిన గ‌ణేశ్ చ‌తుర్ధి( Ganesh Chaturthi ) వేడుక‌ల సంద‌ర్భంగా శ‌బ్ద స్థాయిలు పెరిగాయ‌ని కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి పేర్కొంది.

సెప్టెంబ‌ర్ 7 నుంచి 17వ తేదీ వ‌ర‌కు శ‌బ్ద స్థాయిల‌ను ప‌రిశీలిస్తే.. అత్య‌ధికంగా సున్నిత ప్రాంతాలైన‌ నెహ్రూ జూపార్క్( Zoo Park ), హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ( Hyderabad Central University ) వ‌ద్ద ప‌రిమితికి మించి శ‌బ్ద కాలుష్యం( Sound Pollution ) న‌మోదైంద‌ని అధికారులు తెలిపారు. ఇక జూబ్లీహిల్స్( Jubleehills ), తార్నాక( Tarnaka ) ఏరియాల్లో ప‌గ‌టి పూటే.. 55 డెసిబుల్స్‌కు మించి శ‌బ్ద స్థాయిలు న‌మోదు అయ్యాయి. సెప్టెంబ‌ర్ 12వ తేదీన జూబ్లీహిల్స్‌లో గ‌రిష్టంగా 66.12 డెసిబుల్స్‌కు చేరింది. రాత్రి స‌మ‌యాల్లో 45 డెసిబుల్స్‌కు మించ‌కూడ‌దు. కానీ సెప్టెంబ‌ర్ 7వ తేదీన గ‌రిష్ఠంగా 63.33 డెసిబుల్స్ న‌మోదైన‌ట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబ‌ర్ 15న 65.33 డెసిబుల్స్ న‌మోదైంది.

తార్నాక కూడా జూబ్లీహిల్స్ ప‌రిస్థితినే ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. వినాయ‌క చ‌వితి( Vinayaka Chavithi ) తొలి రోజు తార్నాక‌లో 65.13 డెసిబుల్స్ న‌మోదైంది. ఆ ప‌ద‌కొండు రోజుల పాటు ఆ ఏరియాలో 60 డెసిబుల్స్‌కు త‌గ్గ‌కుండా శ‌బ్ద స్థాయిలు న‌మోదు అయ్యాయి. చివ‌రి రోజైనా సెప్టెంబ‌ర్ 17న 63.42 డెసిబుల్స్ న‌మోదైన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

ప‌ర్యావ‌ర‌ణ ప్రాముఖ్య‌త క‌లిగిన జూపార్క్ వ‌ద్ద సెప్టెంబ‌ర్ 7న ప‌గ‌టిపూట 69.39 డెసిబుల్స్ న‌మోదైంది. ఈ ఏరియాలో 50 డెసిబుల్స్ కంటే ఎక్కువ శ‌బ్ద స్థాయిలు న‌మోదు కావొద్దు. రాత్రి స‌మ‌యాల్లోనూ 68.10 డెసిబుల్స్ న‌మోదు అయ్యాయి. గ‌చ్చిబౌలిలోని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఏరియాలో సెప్టెంబ‌ర్ 10న గ‌రిష్ఠంగా 72.90 డెసిబుల్స్, అదే రోజు రాత్రి 71.59 డెసిబుల్స్ న‌మోదైంది.