Kakatiya Mega Textile Park । వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో కొరియా పెట్టుబడులు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం.. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నది. అక్కడి ప్రఖ్యాత ఎల్‌ఎస్‌ గ్రూపు ప్రతినిధి బృందంతో చర్చలు జరిపింది. వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి టెక్స్‌టైల్‌ ఫెడరేషన్‌ సానుకూలత వ్యక్తం చేసింది

Kakatiya Mega Textile Park । వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో కొరియా పెట్టుబడులు

అక్కడి టెక్స్‌టైల్ ఫెడరేషన్ సానుకూలత
దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ కు జాఉన్తో సమావేశం
వివిధ రంగాల్లో పెట్టుబడులు విస్తరిస్తాం
ముఖ్యమంత్రి రేవంత్‌కు గ్రూప్ చైర్మన్ హామీ

Kakatiya Mega Textile Park । వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు(Kakatiya Mega Textile Park)లో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునకు కొరియా టెక్స్‌టైల్ ఫెడరేషన్ (The Korea Textile Federation) సానుకూలంగా స్పందించింది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) పలు గ్లోబల్ కంపెనీల అధినేతలు, బిజినెస్ గ్రూపులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (Korea Federation of Textile Industry) ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. టెక్స్‌టైల్ రంగం విస్తృత్తికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతోపాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు (global companies) కూడా అనుకూలంగా ఉందని సీఎం తెలిపారు. వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. యంగాన్‌ కార్పొరేషన్ (Yangon Corporation) చైర్మన్ కియాక్‌ సంగ్‌ కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సొయంగ్‌ జూ (Soeung Joo) సహా 25 అగ్రశ్రేణి టెక్స్‌టైల్ కంపెనీల అధినేతలు ఈ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెంట పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు కూడా సమావేశంలో ఉన్నారు.

దక్షిణ కొరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

దక్షిణ కొరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన శుభారంభంగా ప్రారంభమైంది. కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక వ్యవస్థల్లో ఒకటైన ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ (Chairman of LS Group) కు-జాఉన్ తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ప్రపంచ ప్రఖ్యాత ఎల్జీ గ్రూప్ వ్యవస్థాపకులైన కుటుంబాన్ని కలవడంతోనే కొరియా పర్యటన ప్రారంభం కావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ కేబుల్స్ (electric cables), బ్యాటరీల తయారీ, గ్యాస్, ఎనర్జీ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడుల విస్తరణకు ఎల్ఎస్ గ్రూప్ ఆసక్తి కనబర్చింది. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఎల్ఎస్ గ్రూప్ (LS Group) ఉన్నత స్థాయి బృందం త్వరలోనే తెలంగాణను సందర్శించనుంది. ఎల్ఎస్ గ్రూప్ అధినేతతో ముఖ్యమంత్రి సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu), ఉన్నతాధికారులు, ఎల్ఎస్ గ్రూప్ సీనియర్ ప్రతినిధులు కూడా ఉన్నారు.

.