Minister Sitakka | మహిళల భద్రత కోసం స్పెషల్ డ్రైవ్ : మంత్రి సీతక్క
మహిళల భద్రత కోసం రాష్ట్రంలో త్వరలో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. మహిళల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం సచివాలయంలో మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు.

త్వరలో మంత్రులు, ఉన్నతాధికారులతో కమిటి
స్వయం సహాయ సంఘాల సహాయం
పురుషులకు అవగాహన కార్యక్రమాలు
సమీక్షలో మంత్రి సీతక్క
విధాత: మహిళల భద్రత కోసం రాష్ట్రంలో త్వరలో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. మహిళల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం సచివాలయంలో మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళల భద్రత కోసం స్వల్పకాలిక ప్రణాళికలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు.
మహిళా మంత్రులు, ఉన్నతాధి కారులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మహిళా భద్రత కోసం స్వయం సహాయక సంఘాల సహాయాన్ని తీసుకుంటామన్నారు. మహిళా సంఘాల్లో 63 లక్షల మంది సభ్యులున్నారని…మహిళా సంఘ సభ్యులతో గ్రామ స్థాయి నుంచి సోషల్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. సొంత నివాసాల్లో, దగ్గరి మనుషుల నుంచి మహిళలకు వేదింపులు పెరగడం భాదాకరమన్నారు. భాదిత మహిళలు బహిరంగంగా మాట్లాడేలా దైర్యం కల్పిస్తామన్నారు. సమాజంలో ఆలోచన మారే విధంగా ప్రాణాళిక రూపొందిస్తామని వెల్లడించారు. విద్యా సంస్థలు, ఇతర సంస్థల్లో అవేర్ నెస్ క్యాంపేయిన్ లు చేపడుతామన్నారు. మహిళలను వేదించకుండా పురుషులకూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. మహిళలను గౌరవించడం, నేరాలు జరిగినప్పుడు పడే శిక్షలపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలని..ఇందు కోసం పాఠ్యాంశాల్లోనూ వీటిని చేర్చాలని అభిప్రాయం వ్యక్తం చేసారు. కాగా ఇదే అంశంపై మరో సారి సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, మహిళా భద్రతా విభాగం డీజీ షిఖా గోయల్, డీఐజీ రెమా రాజేశ్వరిలు పాల్గొన్నారు.