Cricket Stadium Warangal | వరంగల్‌లో స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం
రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ లో స్పోర్ట్స్ అకాడమీ స్కూల్, క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలు వినతి పత్రాన్ని అందించారు. ఈ అభివృద్ధి ప్రతిపాదనను సీఎంకు వివరంగా విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించి,కావాల్సిన విధి విధానాలను రూపొందించాలని కోరారు.
విధాత, వరంగల్ ప్రతినిధి:
వరంగల్ మహా నగరంలో స్పోర్ట్స్ స్కూల్, ఆధునిక సదుపాయాలతో కూడిన క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి , రేవూరి ప్రకాష్ రెడ్డి, కే ఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి కలిసి విన్నవించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ సానుకూల స్పందించారని, ప్రాంత అభివృద్ధిలో ఇదొక మరొక చారిత్రక ముందడుగు పడిందన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ లో స్పోర్ట్స్ అకాడమీ స్కూల్, క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలు వినతి పత్రాన్ని అందించారు. ఈ అభివృద్ధి ప్రతిపాదనను సీఎంకు వివరంగా విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించి,కావాల్సిన విధి విధానాలను రూపొందించాలని కోరారు. ఎమ్మెల్యేల ఐకమత్యం, కృషి ఫలితంగా ఈ మౌలిక సదుపాయాలు మంజూరు చేశారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మహా నగర ప్రజల కలలుగా ఉన్న క్రీడా మైదానం ఇప్పుడు నెరవేరే దశలో ఉందన్నారు. సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రాజెక్టులు యువతకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఆటల్లో ప్రతిభను వెలికితీసే మార్గంగా మారుతాయన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఒక్కొక నియోజకవర్గం, ఒక్కొక నాయకుని కాదు ఈ అభివృద్ధి మొత్తం వరంగల్ నగరానికి చెందిందన్నారు. మనం అందరం కలిసి చేస్తే ఇలా సాధ్యమవుతుంది అన్నదానికి ఇది బలమైన ఉదాహరణ అని అన్నారు. ప్రత్యేకమైన స్పోర్ట్స్ అకాడమీ, ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానం వంటి ప్రాజెక్టులు, వరంగల్ నగరాన్ని క్రీడా రంగంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేస్తాయని ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, యశస్విని రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి సంబంధించిన భూమి, బడ్జెట్, కార్యాచరణ ప్రణాళికలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కాబోతున్నాయన్నారు.
Brain Stroke | బీ ఫాస్ట్ సూత్రంతో బ్రెయిన్ స్ట్రోక్‌ను అరికట్టొచ్చు!
Anaconda rescued | వీడియో: ఉత్తిచేతులతోనే భారీ అనకొండను పట్టుకున్న వ్యక్తి వీడియో వైరల్
Priyanka Chopra Birthday Vacation | మాల్ధీవులలో రెచ్చిపోయిన ప్రియాంకా చోప్రా జంట
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram