కేయూలో కవులు, రచయితలపై ఎబివిపి భౌతిక దాడి దుర్మార్గపు చర్య

కాకతీయ యూనివర్సిటీలో ఆదివారం కవులు రచయితలు కళాకారులపై ఎబివిపి చేసిన అరాచకపు భౌతిక దాడిని వామపక్ష ,బహుజన విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి

కేయూలో కవులు, రచయితలపై ఎబివిపి భౌతిక దాడి దుర్మార్గపు చర్య

– కేయూ లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్లే కార్డ్స్, నల్లరిబ్బన్లతో నిరసన.

విధాత, వరంగల్ ప్రతినిధి: కాకతీయ యూనివర్సిటీలో ఆదివారం కవులు రచయితలు కళాకారులపై ఎబివిపి చేసిన అరాచకపు భౌతిక దాడిని వామపక్ష ,బహుజన విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడులను ఖండిస్తూ సోమవారం కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్లే కార్డ్స్ చేత బట్టి, మూతికి నల్లరిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా భావ ప్రకటన స్వేచ్ఛపై, ప్రజాస్వామ్య హక్కుల పై జరిగిన దాడిగా భావిస్తున్నామని తెలిపారు.
యూనివర్సిటీలో వివిధ విభిన్న దేశంలో కలిసిమెలిసి జీవిస్తున్న వివిధ వర్గాల ప్రజల మధ్య లౌకిక, ప్రజాస్వామిక వాతావరణాన్ని దెబ్బతీయటమే ధ్యేయంగా ఎబివిపి, ఆర్ఎస్ఎస్ సంస్థలు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, పౌరుల ప్రజాస్వామ్య హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మొగిలి వెంకటరెడ్డి, యు ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాదం తిరుపతి, పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కేయూ రీసర్చ్ స్కాలర్ బి.నరసింహారావు, ఏ.ఐ.ఎస్.ఎఫ్. హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాష బోయిన సంతోష్, యు.ఎస్.ఎఫ్.ఐ. జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ రాజేష్,
పి.డి.ఎస్.యు. రాష్ట్ర సహాయ కార్యదర్శి మిశ్రీనా సుల్తాన్ , వివిధ వామపక్ష, బహుజన విద్యార్థి సంఘాల నాయకులు రంజిత్, చరణ్, మహేష్, వంశీ, హరీష్, గోపి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.