ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యామని మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహబూబ్ నగర్ అమర్‌చింత మండలం సింగంపేటకు చెందిన నితీశ్ ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఓ సబ్జెక్ట్ తప్పాడు
విధాత, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యామని మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహబూబ్ నగర్ అమర్‌చింత మండలం సింగంపేటకు చెందిన నితీశ్ ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఓ సబ్జెక్ట్ తప్పాడు. దీంతో మనస్తాపంతో నితీశ్ ఆత్మకూరు సమీపంలో ఉరేసుకున్నాడు. అలాగే తిమ్మాజిపేట మండలం ఇప్పలపల్లికి చెందిన వైష్ణవి ఇంటర్ ఫెయిలైంది. పరీక్ష తప్పానంటూ పది రోజులు నుంచి దిగాలుగా ఉన్న వైష్ణవి నిన్న ఇంట్లో ఫినాయిల్ తాగి సూసైడ్ చేసుకుంది. పరీక్షల ఫలితాల నేపథ్యంలో సాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కుటుంబాలను విషాదానికి గురి చేస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram