సీఎం రేవంత్‌రెడ్డి విమానంలో సాంకేతిక లోపం.. గంటపాటు పడిగాపులు
సీఎం రేవంత్‌రెడ్డి ముంబాయికి వెళ్లాల్సిన ఇండిగో విమానం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో గంటపాటు సాంకేతిక లోపంతో ఆగిపోయింది

గంట పాటు శంషాబాద్ ఎయిర్ పోర్డులోనే పడిగాపులు
విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి ముంబాయికి వెళ్లాల్సిన ఇండిగో విమానం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో గంటపాటు సాంకేతిక లోపంతో ఆగిపోయింది. రాహుల్‌గాంధీ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభకు హాజరయ్యేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీతో కలిసి ఇండిగో విమానం ఎక్కారు. మధ్యాహ్నం 2.30గంటలకు బయలుదేరాల్సిన విమానం 3.40వరకు కూడా సాంకేతిక లోపంతో ఎయిర్ పోర్టులోనే ఆగిపోయింది. దీంతో గంటకు పైగా వారంతా విమానంలోనే ఉండిపోయారు.