Teenmar Mallanna | కొత్తపార్టీ పెట్టిన తీన్మార్ మల్లన్న
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ని ఆవిష్కరించారు. ప్రజా రిఫరెండం పెట్టడానికి సిద్ధమని ప్రకటించారు.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని ఆవిష్కరించారు. బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేసిన తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరిట పార్టీని స్థాపించారు. కాగా గత గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న కొన్ని విభేధాలతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 16 నెలలు గడుస్తుందని, అప్పటి నుంచి ఇప్పటివరకు తాను బాధ్యతలు సక్రమంగా నిర్వహించానన్నారు. ఈ అంశంపై ప్రజా రిఫరెండం పెడుతున్నాను, ఈ సమావేశంలో ఉన్న మేధావులు, ప్రజలు నేను సరిగ్గా విధులు నిర్వహించలేదని చెబుతే.. రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు.