Telangana Bathukamma Guinness World Record | తెలంగాణ బతుకమ్మకు గిన్నిస్ రికార్డులు

సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ బతుకమ్మతో గిన్నిస్ వరల్డ్ రికార్డు, సీఎంకు మంత్రి జూపల్లి కృష్ణారావు ధన్యవాదాలు తెలిపారు.

Telangana Bathukamma Guinness World Record | తెలంగాణ బతుకమ్మకు గిన్నిస్ రికార్డులు

హైదరాబాద్, సెప్టెంబర్ 30(విధాత): జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం డిపార్ట్మెంట్ ఎండీ క్రాంతి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన నేపథ్యంలో మంత్రి జూపల్లి, ఉన్నతాధికారులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద బతుకమ్మ 63 ఫీట్ల 11 అంగుళాల ఎత్తు, 11 అడుగుల వెడల్పు. 7 టన్నుల బరువుతో తయారు చేసిన బతుకమ్మలో 11 లేయర్లు, 9 రకాల పూవులను వినియోగించారు. అలాగే 1354 మంది మహిళలు ఒకేసారి లయబద్దంగా బతుకమ్మ పాటకలు పాడుతూ.. నృత్యం చేయడం ద్వార రెండు కేటగిరీల్లో మన బతుకమ్మ గిన్నిస్ రికార్డు సృష్టించింది.