BJP | బడ్జెట్ సమావేశాల వ్యూహంపై బీజేఎల్పీ భేటీ
రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో భేటీ అయ్యారు

ప్రభుత్వ హామీలపై నిలదీతకు కసరత్తు
విధాత, హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో భేటీ అయ్యారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
అసెంబ్లీ ఎల్పీ కార్యాలయం లో బీజేఎల్పీ సమావేశం …
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే ల ప్రత్యేక సమావేశం
సమావేశానికి హాజరైన 8 మంది ఎమ్మెల్యేలు#alletimaheshwarreddy #bjlpleader #telanganabjpfloorleader #TelanganaBJP #NarendraModi pic.twitter.com/SMYV5OPdI3— Alleti Maheshwar Reddy (Modi Ka Parivar) (@maheshreddy_bjp) July 12, 2024
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు..అమలులో వైఫల్యాలతో పాటు ఏడు నెలల పాలన కాలంలోని పాలనా వైఫల్యాలను సమావేశాల్లో నిలదీయాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్‌పై ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం, రైతుభరోసా అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చేయాల్సిన కసరత్తును నిర్ధేశించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన నిధుల దుర్వినియోగం..మళ్లింపు వంటి అంశాలను ఈ సమావేశాల్లో ప్రస్తావించాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.