HYDRAA | ‘హైడ్రా’లో 169 పోస్టులు క్రియేట్.. అత్యధికంగా 60 పోలీసు ఉద్యోగాలు..!
HYDRAA | హైదరాబాద్( Hyderabad ) నగరంలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు కాంగ్రెస్ సర్కార్( Congress Govt ) హైడ్రా( HYDRAA )ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హైడ్రాకు చట్టబద్దత కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 169 పోస్టులను క్రియేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
HYDRAA | హైదరాబాద్( Hyderabad )తో పాటు శివార్లలో ఉన్న చెరువులు, జలాశయాలను కబ్జాల నుంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ( HYDRAA )ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం( Telangana Cabinet ) ఇటీవలే నిర్ణయం తీసుకున్నది. ఔటర్ రింగ్ రోడ్డు( Outer Ring Road ) లోపల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థల్లో అన్ని శాఖలకున్న అధికారాలను హైడ్రా( HYDRAA )కు కట్టబెట్టింది.
27 పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, నాలాల ఎఫ్‌టీఎల్( FTL ), బఫర్ జోన్( Buffer Zone )లోని నిర్మాణాలపై హైడ్రా నిర్ణయం తీసుకోనున్నదని కాంగ్రెస్ సర్కార్( Congress Govt ) స్పష్టం చేసింది. ఇందుకోసం ఓఆర్‌ఆర్( ORR ) లోపలి పట్టణ స్థానిక సంస్థల్లోని అన్ని శాఖలు, విభాగాలకు ఉన్న అధికారాలు, స్వేచ్ఛలను హైడ్రాకు కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో పనిచేసేందుకు వివిధ విభాగాల నుంచి 169 మంది అధికారులు, 946 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను డిప్యూటేషన్ మీద బదిలీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ మేరకు 169 మంది అధికారులు ఆయా విభాగాల నుంచి డిప్యుటేషన్ మీద తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
169 పోస్టుల్లో అత్యధికంగా 60 మంది పోలీసు కానిస్టేబుల్ ( Police Constable )పోస్టులే ఉన్నాయి. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీసు( Inspector of Police ) ఉద్యోగాలు 16, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీసు( Sub Inspector of Police ) ఉద్యోగాలు 16 ఉన్నాయి. స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌కు సంబంధించిన ఉద్యోగాలు 12, అసిస్టెంట్ ఇంజినీర్(పీహెచ్) పోస్టులు 10 ఉన్నాయి. ఇక కేడర్ పోస్టుల కింద కమిషనర్(ఏఐఎస్ ర్యాంక్), అడిషనల్ కమిషనర్(ఎస్పీ ర్యాంక్) పోస్టులను ఒక్కొక్కటి చొప్పున క్రియేట్ చేశారు. మరో మూడు అడిషనల్ కమిషనర్(ఎస్పీ ర్యాంక్) పోస్టులు, ఐదు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఉద్యోగాలను కల్పించారు. రెవెన్యూ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఆరు ఉన్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram