తెలంగాణ డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి తన సర్వీసు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో వాష్ రూమ్‌కు వెళ్లిన స్వామి అక్కడే తుపాకీతో కాల్చుకొన్నాడు. తన భార్య, పిల్లలను ఏమీ అనవద్దని రాసివున్న సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. కాగా కుటుంబ కలహాలతోనే స్వామి ఆత్మహత్య చేసుకొన్నట్లు భావిస్తున్నారు.
తన ఆత్మహత్యకు కారణం ఇద్దరని సూసైడ్ నోట్ లో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అసలు స్వామి ఆత్మహత్యకు గల కారణలు ఏంటి? చివరగా ఫోన్‌లో ఎవరితో మాట్లాడాడు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
