DGP Shivadhar Reddy : సివిల్ వివాదాల్లో తలదూర్చకండి
సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకునే పోలీసులపై కఠిన చర్యలు తప్పవని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. స్టేషన్లను సెటిల్మెంట్ కేంద్రాలుగా మార్చవద్దని అంతర్గత సర్క్యులర్ జారీ చేశారు.
హైదరాబాద్, విధాత: తెలంగాణ రాష్ట్ర పోలీసులకు డీజీపీ శివధర్ రెడ్డి, పోలీసు సిబ్బందిని అంతర్గత లేఖ ద్వారా హెచ్చరించారు. సివిల్ వివాదాల్లో (కుటుంబ సంబంధాలు, ఆస్తి విభజన, భూమి వివాదాలు మొదలైనవి) పోలీసులు తలదూర్చకూడదని, అటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. “గీత దాటితే వేటు తప్పదు” అనే సూక్తి గుర్తుచేస్తూ, పోలీసు స్టేషన్లను పంచాయితీ అడ్డాలుగా మార్చి సివిల్ తగాదాలు సెటిల్ చేస్తే ఎవరైనా (హోం గార్డు నుంచి ఐపీఎస్ అధికారి వరకూ) బాధ్యుడవుతారని హెచ్చరించారు.
“సివిల్ వివాదాలు సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయి. ప్రతి పోలీసుకూ ఇది తెలుసు. అయినా వాటిపై దృష్టి సారించి, పోలీసు స్టేషన్‌లను సెటిల్మెంట్ సెంటర్లుగా మార్చడం తప్పు. ఇలాంటి ఫిర్యాదులు వస్తే, పార్టీలు/పంచాయితీలకు మళ్లించాలి” అని పేర్కొన్నారు.
ప్రస్తుతం వివాదాలను పరిష్కరించిన స్టేషన్లు, అధికారులపై తక్షణమే వేటు (కఠిన చర్యలు) పడుతుంది. ఎస్పీలు, సీపీలు, హోం గార్డులు – ఎవరూ మినహాయింపు లేదు.” అని తెలిపారు. పోలీసు యూనిఫామ్, అవినీతి కలిసి ఉండకూడదు. అక్రమాలు, నీతి లోపాలపై కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో నమ్మకం పోతుంది. మన ప్రవర్తన యూనిఫామ్‌కు గౌరవాన్ని, ప్రభుత్వానికి ప్రతిష్టను, సమాజంలో శాంతిని కల్పించాలి’’ అని కోరారు.
ఇవి కూడా చదవండి :
Warangal CP | సమన్వయంతో పనిచేస్తే మేడారం జాతర సక్సెస్ : పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
War Ending Plan | రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలో ముగింపు? 20 అంశాలతో శాంతి ప్రణాళిక ముసాయిదా!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram