War Ending Plan | రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధానికి త్వరలో ముగింపు? 20 అంశాలతో శాంతి ప్రణాళిక ముసాయిదా!

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధానికి తెరదించేందుకు అమెరికా, ఉక్రెయిన్‌ ఒక ముందడుగు వేశాయి. యుద్ధాన్ని ముగించేందుకు 20 సూత్రాల శాంతి ప్రణాళిక ముసాయిదాను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ వెల్లడించారు. అయితే.. రష్యా దీనికి ఎలా స్పందిస్తుందో చూడాలి.

War Ending Plan | రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధానికి త్వరలో ముగింపు? 20 అంశాలతో శాంతి ప్రణాళిక ముసాయిదా!

War Ending Plan | సుదర్ఘీకాలంగా సాగుతున్న ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. దీనిలో భాగంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లదీమిర్‌ జెలెన్‌స్కీ 20 సూత్రాల శాంతి ప్రణాళిక ముసాయిదాను వెల్లడించారు. వీటిపై అమెరికా, ఉక్రెయిన్‌ మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు జెలెన్‌స్కీ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన జెలెన్‌స్కీ.. శాంతి ప్రణాళికలోని భద్రతాపరమైన హామీలు, ఈయూ సభ్యత్వం, పునర్నిర్మాణ నిధులు, కాల్పుల విరమణ తదితర అంశాలను ఒక్కొక్కటిగా వివరించారు. అయితే భూభాగాలపై స్పష్టత లేకపోవడంతో ఈ శాంతి ప్రణాళికను రష్యా అంగీకరిస్తుందా? లేదా? అన్ని సందేహాస్పదంగానే ఉన్నది.

శాంతి ప్రణాళికలోని అంశాలు ఇలా ఉన్నాయి..

1. ఉక్రెయిన్‌ సార్వభౌమత్వం
ఉక్రెయిన్‌ ఒక స్వతంత్ర దేశమని ఈ ఒప్పందం పునరుద్ఘాటిస్తున్నది. ఒప్పందంపై సంతకం చేసే దేశాలన్నీ దీన్ని అధికారికంగా అంగీకరిస్తాయి.

2. రష్యా – ఉక్రెయిన్ మధ్య దాడుల నిషేధ ఒప్పందం
రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి దాడుల నివారణ ఒప్పందం అమల్లోకి వస్తుంది.
యుద్ధ విరమణ పాటిస్తున్నారా? లేదా? అన్నది తెలుసుకునేందుకు అంతరిక్ష ఆధారిత డ్రోన్‌ పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తారు.

3. ఉక్రెయిన్‌కు బలమైన భద్రతా హామీలు
భవిష్యత్తులో రష్యా నుంచి ముప్పు లేకుండా ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ భద్రతా హామీలు కల్పిస్తారు.

4. ఉక్రెయిన్ సైనిక బలం
శాంతికాలంలో ఉక్రెయిన్ సైన్యంలో 8 లక్షల మంది సిబ్బంది కొనసాగుతారు.

5. నాటో తరహా భద్రతా హామీలు
అమెరికా, నాటో, యూరోపియన్ దేశాలు కలిసి ఉక్రెయిన్‌కు నాటో ఆర్టికల్‌–5 తరహా రక్షణ హామీలు ఇస్తాయి.

రష్యా దాడి చేస్తే అన్ని ఆంక్షలు మళ్లీ అమలవుతాయి

ఉక్రెయిన్ ముందుగా రష్యాపై దాడి చేస్తే ఈ హామీలు రద్దవుతాయి

6. యూరప్‌పై దాడులు చేయబోమని రష్యా హామీ
యూరప్‌, ఉక్రెయిన్‌పై దాడులు చేయబోమని రష్యా చట్టబద్ధంగా ప్రకటించాలి.

7. యూరోపియన్ యూనియన్ సభ్యత్వం
నిర్దిష్ట కాలవ్యవధిలో ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం పొందుతుంది.

8. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి అంతర్జాతీయ అభివృద్ధి ప్యాకేజీ
టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, గ్యాస్ మౌలిక సదుపాయాలు, నగరాల పునర్నిర్మాణంపై భారీ పెట్టుబడులు.

9. 200 బిలియన్ డాలర్ల పునరుద్ధరణ నిధి
అమెరికా, యూరప్ దేశాలు కలిసి ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి భారీ నిధులు సమకూరుస్తాయి.

10. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
యుద్ధం ముగిసిన వెంటనే అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌కు ఉక్రెయిన్ చర్యలు వేగవంతం చేస్తుంది.

11. అణుశస్త్రాల లేని దేశంగానే ఉక్రెయిన్
అణు ఆయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందానికి కట్టుబడి ఉంటుంది.

12. జపొరిజ్జియా అణు విద్యుత్ కేంద్రం
ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని ఉక్రెయిన్, అమెరికా, రష్యా సంయుక్తంగా నిర్వహిస్తాయి.

13. సామాజిక సామరస్య కార్యక్రమాలు
జాతి వివక్ష, మత ద్వేషం తొలగించే విద్యా కార్యక్రమాలు అమలు చేస్తారు.

14. వివాదాస్పద ప్రాంతాల్లో సైనిక స్థితి
డోనెత్స్క్‌, లూహాన్స్‌క్‌, జపొరిజ్జియా, ఖెర్సోన్‌ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న సైనిక రేఖలనే సంపర్క రేఖలుగా పరిగణిస్తారు.

15. భవిష్యత్తులో బలవంతపు మార్పులు ఉండవు
భూభాగ ఒప్పందాలను బలవంతంగా మార్చబోమని రెండు దేశాలు అంగీకరిస్తాయి.

16. డ్నిప్రో నది, బ్లాక్ సీ వినియోగం
ఉక్రెయిన్ వాణిజ్య అవసరాలకు ఈ జలమార్గాలను అడ్డుకోబోమని రష్యా హామీ.

17. మానవతా కమిటీ ఏర్పాటు
యుద్ధ ఖైదీల మార్పిడి, పిల్లలు సహా బందీల విడుదల.

18. ఎన్నికలు
ఒప్పందం అమలులోకి వచ్చిన వెంటనే ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహిస్తారు.

19. ఒప్పందానికి చట్టబద్ధత
ఈ శాంతి ఒప్పందాన్ని అంతర్జాతీయ శాంతి మండలి పర్యవేక్షిస్తుంది. ఒప్పంద ఉల్లంఘన జరిగితే ఆంక్షలు అమలు చేస్తారు.

20. సంపూర్ణ కాల్పుల విరమణ
అన్ని దేశాలు అంగీకరించిన వెంటనే తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది.

ఇవి కూడా చదవండి..

World’s Busiest Airports : అత్యంత రద్దీ ఏయిర్ పోర్టులలో…న్యూఢిల్లీకి ఏడో స్థానం
Shivaji | వివాదంపై మ‌ళ్లీ నోరు విప్పిన శివాజీ.. వాటికి క‌ట్టుబ‌డే ఉంటానంటూ సంచ‌ల‌న కామెంట్స్
Future City : ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ సమ్మిట్ ఊపు… రియల్ ఎస్టేట్ జోరందుకుంటుందా?