Telangana farmer news|తెలంగాణ రైతులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్బంగా గుడ్ న్యూస్ తెలిపింది. సన్న ధాన్యం పండించిన రైతులకు ప్రకటించిన క్వింటాకు రూ. 500 బోనస్ బకాయిల చెల్లింపుకు పౌరసరఫరాల శాఖ తాజాగా రూ. 500 కోట్ల నిధులను విడుదల చేసింది.
విధాత, హైదరాబాద్: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్బంగా గుడ్ న్యూస్ తెలిపింది. సన్న ధాన్యం పండించిన రైతులకు ప్రకటించిన క్వింటాకు రూ. 500 బోనస్ బకాయిల చెల్లింపుకు పౌరసరఫరాల శాఖ తాజాగా రూ. 500 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు తాజాగా విడుదల చేసిన 500 కోట్ల రూపాయలతో కలిపి.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ప్రభుత్వం మొత్తం 1,429 కోట్ల రూపాయల బోనస్ నిధులను విడుదల చేసినట్లయింది. సన్న రకం ధాన్యం పండించే వారిని ప్రోత్సహించడంతో పాటు.. పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఇప్పటికే చాలా మంది రైతుల ఖాతాల్లోకి ధాన్యం డబ్బులు జమ కాగా.. ఒకటి లేదా రెండు రోజుల్లో మిగతా రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు కూడా జమ అయ్యే అవకాశం ఉంది. పండుగ వేళ చేతికి డబ్బులు అందనుండటంతో పాటు యాసంగి పంట సాకుకు రైతు భరోసా డబ్బుల పంపిణీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో సన్నల బోనస్ తమకు ఎంతో ప్రయోజనకరం కానుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram