విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరంపై పీ.సీ.ఘోష్ కమిషన్ ఏర్పాటు సరైందేనంటునే..నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావు, అధికారులపై చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తీర్పులోని అంశాలపై న్యాయనిపుణులతో సమీక్షించారు. తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తమకు అనుకూలంగా ఉందంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తుండటంపై కూడా చర్చించారు. రేపు జరుగబోయే రాష్ట్ర కేబినేట్ భేటీలో ఈ అంశంపై చర్చించాలని నిర్ణయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలు ఇప్పటికే కాళేశ్వరం అక్రమాలను వెల్లడించాయని, అక్రమాలపై సీబీఐ విచారణ జరుపాలని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి లేఖ రాసి 9నెలలు గడిచిన స్పందన లేదని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం అక్రమాలపై విచారణకు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో పాటు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లుగా సమాచారం.
ఇవి కూడా చదవండి :
ఐదు రంగులలో పుచ్చకాయల సాగు..రూ.6.50లక్షల ఆదాయం!
శంషాబాద్ లో రూ.90కోట్ల విలువైన 9ఎకరాలను కాపాడిన హైడ్రా
