తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం తగ్గి సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలనే సంకల్పంతో ప్రభుత్వం నాగార్జునసాగర్ వద్ద కృష్ణా నదీ తీరాన వరుణ యాగాన్ని ప్రారంభించింది. వేకువజామున 4:05 గంటలకు గోపూజతో మొదలైన ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
మధ్యాహ్నం 3:24 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. యాదగిరి గుటట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చక పండిత బృందం ఆధ్వర్యంలో వరుణ యాగం కొనసాగుతుంది.
