High Court Website Hacked : తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాకింగ్

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌లో ఆర్డర్లు డౌన్‌లోడ్ చేస్తే బెట్టింగ్ సైట్ తెరుచుకోవడంతో హ్యాకింగ్ అనుమానాలు వ్యక్తమయ్యాయి. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

High Court Website Hacked : తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాకింగ్

విధాత, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురవ్వడం సంచలనంగా మారింది. ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్‌ చేస్తుంటే.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ సైట్‌ దర్శనమివ్వడంలో హైకోర్టు సిబ్బంది షాక్ కు గురయ్యారు. పీడీఎఫ్‌ ఫైల్స్‌కు బదులు.. BDG SLOT అనే బెట్టింగ్ సైట్ తెరుచుకుంటుండటంతో అంతా ఆయోమయంలో పడ్డారు. ఈ విషయంపై హైకోర్టు రిజిస్ట్రార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైకోర్టు వెబ్ సైట్ హ్యాకింగ్ గురైనట్లుగా భావించి దర్యాప్తు చేస్తున్నారు.