FASTag payment| ఫాస్టాగ్ లేని వాహనదారులకు గుడ్ న్యూస్!
ఫాస్టాగ్ లేని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నేటి నుంచి ఫాస్టాగ్ లేని వాహనదారులు టోల్ రుసుంను యూపీఐ ద్వారా చెల్లిస్తే 75శాతరం రాయితీ అమలు చేస్తుంది.
విధాత : ఫాస్టాగ్ (FASTag)లేని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఫాస్టాగ్ లేని వాహనాలకు టోల్ రుసుం చెల్లింపులో కొత్త మార్పులు తీసుకొచ్చింది. ఫాస్టాగ్ లేని వాహనదారులు యూపీఐ ద్వారా చెల్లిస్తే(UPI payment) రెట్టింపు ఛార్జీల నుంచి మినహాయించి 75శాతం రాయితీ ప్రకటించింది. యూపీఐ ద్వారా టోల్ రుసుం చేసే ఫాస్టాగ్ లేని వాహనదారులకు ఇకపై 25 శాతం అదనపు రుసుము మాత్రమే వసూలు చేస్తారు. నేటి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించే క్రమంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఫాస్టాగ్ లేని వాహనదారులు, ఫాస్టాగ్ లో బ్యాలెన్స్ లేని వారు, ఏదైనా కారణంతో ఫాస్టాగ్ పనిచేయని వారి నుంచి టోల్ చార్జీ డబుల్ వసూలు చేస్తున్నారు. ఉదాహారణకు టోల్ చార్జ్ రూ.100ఉంటే ఫాస్టాగ్ ఉన్న వాహనాదారులు రూ.100చెల్లిస్తే సరిపోతుంది. ఫాస్టాగ్ లేని వారు నగదు చెల్లింపు చేసినా, డిజిటల్ పేమెంట్ చేసినా రూ. 200వసూలు చేస్తున్నారు. శనివారం నుంచి వచ్చిన కొత్త నిబంధన మేరకు ఫాస్టాగ్ లేని వారు టోల్ చార్జ్ ను యూపీఐ పేమెంట్ చేస్తే రూ.100కు రూ.125రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram