విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో 66.20% ఉత్తీర్ణత, సెకండియర్ లో 70.58% ఉత్తీర్ణత సాధించారు. గతేడాది లాగానే ఈసారి కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 4,89,123మంది విద్యార్థులు హాజరు కాగా.. 3,23,807 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో ఉత్తీర్ణత శాతం 74.40శాతం ఉండగా.. బాలురు ఉత్తీర్ణత శాతం 57.69గా ఉంది.
ద్వితీయ ఇంటర్ పరీక్షలకు మొత్తంగా 5,07,948 మంది విద్యార్థులు హాజరు కాగా.. 3,58,490మంది (70.58శాతం) ఉత్తీర్ణత నమోదైంది. బాలికల ఉత్తీర్ణత శాతం 78.65 ఉండగా.. బాలుర ఉత్తీర్ణత శాతం 62.50గా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది.
ఈసారి దాదాపు 9.50 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. . ఫస్ట్ ఇయర్ లో బాలబాలికలు 3,23,807 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ లో 3,58,490 మంది పాస్ అయ్యారు.
ఫలితాల కోసం తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలను https://tgbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లలో విద్యార్థులు తమ రోల్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఒక్క క్లిక్‌తోనే రిజల్ట్స్‌ని పొందవచ్చని బోర్టుల తెలిపింది. ఇంటర్ విద్యార్థులు తమ రిజల్ట్స్‌ని నేరుగా తమ వాట్సప్ ద్వారా (tg inter results in whatsapp) నేరుగా డౌన్‌లోడ్ చేసుకొనే సదుపాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. స్మార్ట్ ఫోన్‌లలో 80969 58096 నంబర్‌ను సేవ్ చేసుకొని ‘Hi’ అని మెసేజ్ చేసి ‘BIE Exam Result’ అని టైప్ చేయడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకునే అవకాశం కల్పించింది. పరీక్ష ఫలితాల విడుదల కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఒక నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని TGBIE వైస్ చైర్‌పర్సన్ IAS యోగిత రాణా తెలిపారు.
సప్లమెంటరీ పరీక్షల షెడ్యూల్
ఇంటర్ పరీక్షల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 13 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ ఏప్రిల్ 20 వరకు ఉంది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లింపు ఏప్రిల్ 13 నుంచి ప్రారంభం అవుతుంది. దీనికి ఏప్రిల్ 20 చివరి తేదీ. సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి ప్రారంభం అవుతాయి. రెండు సెషన్స్‌లో పరీక్షల నిర్వహణ ఉంటుందని తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మే 22న ప్రారంభమవుతాయి.. ఇవి కూడా రెండు సెషన్లలో నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది.
