రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ ఫలితాలను రేపు(ఆదివారం) విడుదల చేయనున్నట్లుగా తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లుగా బోర్డు తెలిపింది.

రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ ఫలితాలను రేపు(ఆదివారం) విడుదల చేయనున్నట్లుగా తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లుగా బోర్డు తెలిపింది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రభుత్వ కార్యదర్శి (విద్యాశాఖ) యోగితా రాణా ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు తొమ్మిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలను https://tgbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లలో విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయడం ద్వారా ఒక్క క్లిక్‌తోనే రిజల్ట్స్‌ని పొందవచ్చని బోర్టుల తెలిపింది. ఇంటర్‌ విద్యార్థులు తమ రిజల్ట్స్‌ని నేరుగా తమ వాట్సప్‌ ద్వారా (tg inter results in whatsapp) నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకొనే సదుపాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ ఫలితాల కోసం మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వాట్సప్‌లోనే పొందేలా ఏర్పాటు చేసింది. స్మార్ట్‌ ఫోన్‌లలో 80969 58096 నంబర్‌ను సేవ్‌ చేసుకొని ‘Hi’ అని మెసేజ్‌ చేసి ‘BIE Exam Result’ అని టైప్ చేయడం ద్వారా ఫలితాలు చెక్‌ చేసుకునే అవకాశం కల్పించింది.