Thummala Nageshwar Rao : మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ..ఉద్యోగులపై ఆగ్రహం
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీల్లో హాజరు కాకపోయిన ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమయపాలన పాటించాలని హెచ్చరించారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీ సందర్బంగా ఉద్యోగులు విధులకు సకాలంలో హాజరుకాకపోవడాన్ని గుర్తించారు. సమయపాలన పాటించని సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇష్టం ఉన్నప్పుడు డ్యూటీకి వస్తారా?..విధి నిర్వహణ వేళలు పాటించరా? అంటూ మండిపడ్డారు. కార్యాలయంలో ఉద్యోగుల హాజరుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ విధానాన్ని పరిశీలించి.. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా హాజరు తీసుకుంటున్నారా లేక ఫింగర్ ప్రింట్ ద్వారా సేకరిస్తున్నారా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.
భవనాల నిర్వహణ సరిగా లేకపోవడంపైన..శిథిలావస్థలో కనిపించడం పట్ల మంత్రి తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా తుమ్మల తన మంత్రిత్వ శాఖ పరిధిలోని మార్కెటింగ్, వ్యవసాయ శాఖల కార్యాలయాలను సైతం ఆకస్మిక తనిఖీ చేయడం..ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులకు మోమోలు జారీ చేయాలని ఆదేశించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram